Page Loader
గుడ్ న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయ్
వంట నూనె ధరల తగ్గింపు

గుడ్ న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. ఇన్నాళ్లు కొండెక్కిన వంట నూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. శుద్ధి చేసిన (రిఫైన్డ్) సోయాబ్, పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) నూనెలపై దిగుమతి సుంకాన్ని 17.5శాతం నుంచి 12.5శాతానికి ప్రభుత్వం తగ్గించింది. గురవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చిందని ఫలితంగా దేశీయంగా ఈ నూనెల లభ్యతను పెంచడంతో పాటు ధరలు తగ్గేందుకూ ఉపకరిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సాధారణంగా ముడి (క్రూడ్) సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలను ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు రిఫైన్డ్ నూనెల పైనా దిగుమతి సుంకాన్ని తగ్గించడం విశేషం.

Details

ధరల తగ్గింపుతో వినియోగదారులు హర్షం

వంట నూనెలలపై దిగుమతి సుంకం 13.7 శాతంగా ( సామాజిక సంక్షేమ సెస్‌తో కలిపి) ఉండనుంది. వంట నూనెలల దిగుమతులపై ఈ సుంకం 5.5 శాతమే. ప్రభుత్వ తాజా చర్య మార్కెట్ సెంటిమెంటును తాత్కిలికంగా ప్రభావితం చేసినా దిగుమతుల్ని పెద్దగా ఆకర్షించకపోవచ్చని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బివి.మెహతా ప్రకటించారు. ఈ వంట నూనెల ధరలు తగ్గింపుతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.