Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 60శాతం సీట్లపై అదనపు ఛార్జీలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను నియంత్రించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా సీట్ల ఎంపిక పేరుతో ఎయిర్‌లైన్స్ అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విండో సీట్లు, దారి పక్కన ఉన్న సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో వాటిపై అధిక ఛార్జీలు విధిస్తున్నారు.
Details
ప్రయాణికుల ఫిర్యాదుతో కీలక నిర్ణయం
సాధారణంగా మధ్య వరుస లేదా చివరి భాగంలోని కొద్ది సీట్లకు మాత్రమే అదనపు ఛార్జీలు ఉండవు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదనపు ఛార్జీలపై నియంత్రణతో పాటు, ఎయిర్‌లైన్స్ పారదర్శక విధానాలు పాటించేలా పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి:
Details
మార్గదర్శకాలు ఇవే
అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లను ఉచితంగా కేటాయించాలి ఒకే పీఎన్‌ఆర్‌తో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కలిసి కూర్చునేలా సీట్లు ఇవ్వాలి క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రవాణా చేయాలి పెంపుడు జంతువుల రవాణాపై స్పష్టమైన పాలసీలు ఉండాలి విమానాల ఆలస్యం లేదా రద్దు సమయంలో ప్రయాణికుల హక్కులను తప్పనిసరిగా పాటించాలి ప్రయాణికుల హక్కుల సమాచారాన్ని వెబ్‌సైట్లు, యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌పోర్ట్ కౌంటర్లలో ప్రదర్శించాలి ప్రాంతీయ భాషల్లో కూడా స్పష్టమైన సమాచారం అందించాలి ఈ కొత్త మార్గదర్శకాలతో ప్రయాణికులపై పడుతున్న అదనపు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.