Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు.. మంచి స్టైపెండ్‌తో 1865 పోస్టులు!
ఈ వార్తాకథనం ఏంటి
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,865 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 303, తెలంగాణలో 164 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29, 2026 నుంచి ప్రారంభమై మే 19, 2026 వరకు కొనసాగుతుంది.
వివరాలు
విద్యా అర్హత
ఏదైనా విభాగంలో పట్టభద్రుడై ఉండాలి. అభ్యర్థి డిగ్రీ ఫలితం 2026 ఏప్రిల్ 1 లేదా అంతకుముందే విడుదలై ఉండాలి.
వయో పరిమితి (01.04.2026 నాటికి)
కనీస వయసు: 20 సంవత్సరాలు
గరిష్ట వయసు: 28 సంవత్సరాలు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ రాత పరీక్ష
స్థానిక భాషా పరీక్ష
పత్రాల ధృవీకరణ
వైద్య పరీక్ష
వివరాలు
స్టైపెండ్ (నెలవారీ)
గ్రామీణ / సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ.15,000
అర్బన్ ప్రాంతాలు: రూ.18,000
మెట్రో నగరాలు: రూ.20,000
ఈ అప్రెంటిస్‌షిప్ వ్యవధి 1 సంవత్సరం
దరఖాస్తు ఫీజు
జనరల్ / OBC (పురుషులు): రూ.944
జనరల్ / OBC (మహిళలు): రూ.708
SC / ST / PwBD / ట్రాన్స్‌జెండర్: రూ.236
అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.