Gold Rate Today: కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చేలా ధరలు భారీగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు, ట్రెజరీ బాండ్ల ప్రతిఫలాలు పెరగడంతో విలువైన లోహాల ధరలు దిగొచ్చాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,500 వరకు తగ్గింది.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,910కి పడిపోయింది. క్రితం రోజు ముగింపు ధర రూ.1,38,400తో పోలిస్తే రూ.2,500కు పైగా తగ్గింది.
వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. కిలో వెండి ధర రూ.1,74,749 నుంచి రూ.1,69,510కి దిగొచ్చింది.
అంటే ఒక్కరోజులోనే రూ.5వేలకు పైగా తగ్గింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పతనం
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.8 శాతం వరకు పడిపోయింది. దీంతో ఔన్సు బంగారం ధర 3,789 డాలర్లకు చేరింది.
వెండి ధర కూడా తగ్గి ఔన్సుకు 46.02 డాలర్ల వద్దకు దిగొచ్చింది.
మరోవైపు కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1,31,512గా నమోదైంది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.1,64,279 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో తగ్గిన మెరుపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు బలపడుతున్నాయి.
దీంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి లోహాలపై మదుపర్ల ఆసక్తి తగ్గుతోంది. ఫలితంగా వాటి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.
దేశీయంగా రూపాయి బలపడటం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు మరో కారణంగా మారింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 93.27 వద్ద ప్రారంభమైంది.