Jio : జియో నుంచి ఇంటర్నేషనల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రోమింగ్‌ప్యాక్ లేకపోయినా ఓటీపీలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్ సదుపాయం ద్వారా విదేశాల్లో ఉన్నప్పటికీ ఇన్‌కమింగ్ ఎస్సెమ్మెస్‌లను ఉచితంగా అందుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో బ్యాంక్ ఓటీపీలు, లావాదేవీల అలర్ట్లు వంటి ముఖ్యమైన సందేశాలను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ సదుపాయం పొందాలంటే యూజర్లు తమ ఫోన్‌ను వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి, వైఫై కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలి.
Details
రోమింగ్ ప్యాక్ అవసరం లేదు
ఇలా చేస్తే కేవలం మెసేజీలు అందుకోవడానికి మాత్రమే రోమింగ్ ప్యాక్ అవసరం లేకుండా పోతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు, అకౌంట్ లాగిన్ వెరిఫికేషన్ కోసం అవసరమైన ఓటీపీలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ సదుపాయం వినియోగించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. దేశీయంగా ఒక యాక్టివ్ రీచార్జ్ ప్లాన్ ఉండాలి. అలాగే యూజర్ ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ ఉండటం తప్పనిసరి. ఈ ఫీచర్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.