
Gold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.
నిన్న బంగారం ధర పెరిగిన తరువాత, నేడు మళ్లీ తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 28న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,840కి చేరుకుంది.
ఇది గత రోజు ధరతో పోల్చితే రూ. 160 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ. 71,350కి చేరుకుంది, ఇది రూ. 150 తగ్గినట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్, విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,840గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,350గా ఉంది. వెండి కిలో రూ. 99,900గా ఉంది.
Details
బెంగళూరు, ముంబైలో కూడా ఇవే ధరలు
దేశవ్యాప్తంగా బెంగళూరు, ముంబై వంటి నగరాలలో కూడా ఇవే ధరలున్నాయి.
దిల్లీ నగరంలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500 వద్ద ఉంది. భారతదేశంలో బంగారం స్వచ్ఛత గుర్తించడానికి ISO ద్వారా హాల్ మార్క్ అందించనుంది.
24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అనే మార్కులు ఉంటాయి. ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
కానీ కొందరు 18 క్యారెట్లను కూడా వాడుతారు. 24 క్యారెట్ల బంగారం 99.9శాతం, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91శాతం స్వచ్ఛమైనది.