Ankur Warikoo: రూ.100 కోట్ల బిజినెస్‌కు గుడ్ బై.. వ్యాపారవేత్త కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అంకుర్ వారికూ చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కంటెంట్ క్రియేటర్‌గా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన అంకుర్.. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్న తన రూ.100 కోట్ల ఆన్‌లైన్ వ్యాపారాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించగా, ప్రస్తుతం ఇది నెట్టింట విస్తృత చర్చకు దారి తీసింది. 2020లో ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ కోర్సుల బిజినెస్ తాను ఊహించిన దానికంటే ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని అంకుర్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తమ కోర్సులను అభ్యసించారని, వ్యాపారం ద్వారా రూ.100 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. అలాగే రూ.25 కోట్ల లాభాలు కూడా వచ్చాయని పేర్కొన్నారు.
వివరాలు
త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం
అయితే ఇంత విజయవంతమైనప్పటికీ, ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించడంలో ఇక అర్థం కనిపించడం లేదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. తన నిర్ణయం వెనుక అసలు కారణాలపై పూర్తి వివరాలను శనివారం విడుదల చేసే వీడియోలో వివరిస్తానని తెలిపారు. అంకుర్ పోస్టు వైరల్ అవుతుండగా నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఈ నిర్ణయం వెనుక కృత్రిమ మేధ (AI) ప్రభావం ఉందా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, "అయ్యుండొచ్చు" అంటూ అంకుర్ సమాధానం ఇవ్వడం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు ఆయన త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారా అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.