Sunder Pichay-Google-Ai-Wealth: సూపర్ బూమ్ బూమ్ ఏఐ...సంపదను పెంచుకుంటున్నసుందర్ పిచాయ్
ఆల్ఫాబెట్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, నాన్-ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్ అయిన సుందర్ పిచాయ్(Sunder Pichay) (51) అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దగ్గరలో ఉన్నారు. 2015లో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ(Google ceo)అయినప్పటి నుంచి ఆ కంపెనీ స్టేక్స్ 400% పైగా పెరిగాయి. అదే కాలంలో గూగుల్... ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్‌లను కూడా అధిగమించింది. క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI)ఆధారిత వృద్ధి ద్వారా కంపెనీ తొలి త్రైమాసికంలో బాగా లాభపడింది. గూగుల్ చరిత్రలో తొలిసారి డివిడెండ్‌ను కూడా ప్రవేశపెట్టింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, భారీ స్టేక్ రికార్డు సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పిచాయ్ చరిత్ర సృష్టించారు.
టీవీ లేదు..కారూ లేదు..
ఆయన సంపదను దాదాపు $1 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుందర్ పిచాయ్, ఆయన సోదరుడు రెండుగదుల అపార్ట్ మెంట్లో లివింగ్ రూమ్ ఫ్లోర్ లోనే కింద నిద్రపోయేవారు. అతడికి ఆ సమయంలో టెలివిజన్ గానీ,కారు గానీ లేదు. అటువంటి పరిస్థితుల మధ్య చెన్నైలో పెరిగిన సుందర్ పిచాయ్ కు ఒక్కోసారి తాగేందుకు మంచినీళ్లు కూడా దొరికేవి కాదని ఒకనొక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పిచాయ్ కు 12 ఏళ్ల ఉన్నప్పుడు ఇంటికి తొలి రోటరీ టెలిఫోన్ వచ్చింది. దాని టెక్నాలజీ అది అందించే సౌకర్యాలు అతడిని బాగా ఆలోచింపచేశాయని తెలిపారు.
ఫోన్ సౌకర్యాలు టెక్ పరిశ్రమవైపు దృష్టి సారించేలా చేశాయి: పిచాయ్
బ్రిటిష్ కంపెనీ జీఈసీ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా తన తండ్రి ఉద్యోగం గురించి ఆలోచించాడు. అప్పుడే టెక్నాలజీ పరిశ్రమల వైపు తన దృష్టి మళ్లిందని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచే అతడు స్కూలింగ్ బాగా రాణించేవాడు. చివరికి ఖరగ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు.