LOADING...
Bengaluru: బెంగళూరులో గూగుల్‌ భారీ క్యాంపస్‌.. మరో 20,000 మందికి అవకాశాలు
బెంగళూరులో గూగుల్‌ భారీ క్యాంపస్‌.. మరో 20,000 మందికి అవకాశాలు

Bengaluru: బెంగళూరులో గూగుల్‌ భారీ క్యాంపస్‌.. మరో 20,000 మందికి అవకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ టెక్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. విదేశీ ఉద్యోగులకు వర్క్‌ వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసిన పరిస్థితుల్లో, అవసరమైన నిపుణులను సమకూర్చుకునేందుకు మన దేశంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనే మరో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆల్ఫాబెట్‌ అడుగులు వేస్తోందని బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ పేర్కొంది. దేశంలో ప్రధాన టెక్‌ హబ్‌గా పేరొందిన బెంగళూరులో కొత్తగా పెద్ద కార్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కంపెనీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

20 వేల మంది అదనపు ఉద్యోగులు పనిచేసే అవకాశం

బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ టెక్‌ కారిడార్‌లోని అలెంబిక్‌ సిటీలో ఒక ఆఫీస్‌ టవర్‌ను ఆల్ఫాబెట్‌ లీజుకు తీసుకుందని తెలుస్తోంది. అంతేకాదు, మరో రెండు స్థలాలను కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మూడు స్థలాల కలిపి విస్తీర్ణం సుమారు 24 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థలాలన్నింటిని వినియోగంలోకి తీసుకుంటే, దాదాపు 20 వేల మంది అదనపు ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో ఆల్ఫాబెట్‌కు సుమారు 14 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో మొత్తం 1.90 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.

Advertisement