LOADING...
Gold imports: పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!
పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!

Gold imports: పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులు సున్నా సుంకంతో దిగుమతి చేసుకునే పసిడిపై పరిమితులు విధించింది. ఈ మేరకు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ ప్రకటన విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ పథకం కింద సున్నా సుంకంతో గరిష్ఠంగా 100 కిలోల పసిడిని మాత్రమే దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి పసిడి దిగుమతులకు అనుమతి పొందాలంటే, ఇప్పటికే తీసుకున్న అనుమతుల్లో కనీసం 50 శాతం ఎగుమతులను పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేసింది.

వివరాలు 

పసిడి దిగుమతులను మరింత నియంత్రించేందుకు కేంద్రం చర్యలు

ఇప్పటి వరకు ఈ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులకు ఎలాంటి పరిమితులు లేకుండా సున్నా సుంకంతో పసిడి దిగుమతులకు అవకాశం ఉండేది. ఆభరణాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ సౌకర్యాన్ని అమలు చేసింది. దీనితో పాటు ప్యాకేజింగ్‌ సామగ్రి, ఇంధనం, నూనెల వంటి అవసరమైన వస్తువుల దిగుమతులకూ సుంక రాయితీలు అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఆభరణాల ఎగుమతుల పేరుతో జరుగుతున్న పసిడి దిగుమతులను మరింత నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్టు స్పష్టమవుతోంది. ఇకపై అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ పథకం కింద తొలిసారి దరఖాస్తు చేసే సంస్థలకు తయారీ కేంద్రం, ఉత్పత్తి సామర్థ్యాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయనున్నట్టు వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ వెల్లడించింది.

వివరాలు 

పసిడి దిగుమతులను క్రమబద్ధీకరించడమే ప్రధాన ఉద్దేశం

దిగుమతి చేసుకున్న పసిడిని నిబంధనల ప్రకారం నిజంగా ఆభరణాల తయారీ, ఎగుమతులకే వినియోగిస్తున్నారా అనే అంశంపై కూడా పర్యవేక్షణ పెంచనున్నారు. పథకం దుర్వినియోగాన్ని అరికట్టడం, పసిడి దిగుమతులను క్రమబద్ధీకరించడమే కేంద్రం తాజా చర్యల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

Advertisement