Page Loader
ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు 
ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు

ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు 

వ్రాసిన వారు Stalin
May 03, 2023
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) పొడిగించింది. జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నవంబర్ 4, 2022న సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం పెన్షనర్లు/సభ్యుల నుంచి ఆప్షన్/జాయింట్ ఆప్షన్ ధ్రువీకరణ కోసం దరఖాస్తులను పొందేందుకు ఈపీఎఫ్‌ఓ ఏర్పాట్లు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈపీఎఫ్‌ఓ

12 లక్షలకు పైగా దరఖాస్తులు 

ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాస్తవానికి అయితే ఆన్‌లైన్ సౌకర్యం మే 3, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సమయం పొడిగించాలని పలు వర్గాల నుంచి విజ్ఞప్తి చేశాయి. దీంతో అర్హులైన వ్యక్తులందరూ తమ దరఖాస్తులను ఫైల్ చేయడానికి వీలు కల్పించడానికి 26 జూన్ 2023 వరకు గడువు ఉంటుందని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. ఉద్యోగులు, యజమానులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.