Loading...
RBI Plastic Notes : ప్లాస్టిక్ కరెన్సీకి గ్రీన్ సిగ్నల్.. పాలిమర్ నోట్లతో నకిలీ కరెన్సీకి చెక్!
ప్లాస్టిక్ కరెన్సీకి గ్రీన్ సిగ్నల్.. పాలిమర్ నోట్లతో నకిలీ కరెన్సీకి చెక్!

RBI Plastic Notes : ప్లాస్టిక్ కరెన్సీకి గ్రీన్ సిగ్నల్.. పాలిమర్ నోట్లతో నకిలీ కరెన్సీకి చెక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సన్నాహాలు వేగవంతం చేసింది. కరెన్సీ వినియోగం పెరగడం, నకిలీ నోట్లను అరికట్టడం, నోట్ల జీవితకాలాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో ఈ కొత్త తరహా నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ యోచిస్తోంది.

వివరాలు

మొదట రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్టు

పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ప్రణాళిక రూపొందిస్తోంది.

వీటి పనితీరు, ప్రజల స్పందనను పరిశీలించిన అనంతరం పూర్తి స్థాయిలో అమలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

2027 నాటికి దేశవ్యాప్తంగా పాలిమర్ నోట్లను విస్తృతంగా ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం.

వివరాలు

పాలిమర్ నోట్ల ప్రత్యేకతలు

సాధారణ కాటన్ ఆధారిత కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లకు అనేక ప్రయోజనాలున్నాయి. * ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

నీటికి తడవవు

సులభంగా చిరిగిపోవు.

అధునాతన భద్రతా ఫీచర్లతో తయారవ్వడం వల్ల నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో ఉపయోగపడతాయి.

నోట్ల ముద్రణ, నిర్వహణ, మార్పిడి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్ వంటి అనేక దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు విజయవంతంగా వినియోగంలో ఉన్నాయి.

భారతదేశంలో గతంలో పరిమిత స్థాయిలో వీటిపై ప్రయోగాలు జరిగినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అమలు చేయలేదు.

ADVERTISEMENT

వివరాలు

తయారీకి గ్లోబల్ టెండర్లు

పాలిమర్ నోట్ల తయారీలో ఉపయోగించే పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం ఆర్‌బీఐ నోట్ల ముద్రణ విభాగం గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) జారీ చేసింది.

ఆసక్తి ఉన్న సంస్థలు ఆగస్టు 18లోపు బిడ్లు సమర్పించాలని సూచించింది.

దీంతో ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్‌బీఐ చర్యలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు

కాగితపు నోట్లు కొనసాగుతాయి

పాలిమర్ నోట్లు చలామణిలోకి వచ్చినా, ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాటన్ ఆధారిత కాగితపు నోట్లను వెంటనే ఉపసంహరించుకునే నిర్ణయం ఆర్‌బీఐ తీసుకోలేదు.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కాగితపు నోట్లు పూర్తిగా రద్దు చేసి ప్లాస్టిక్ నోట్లు మాత్రమే వస్తాయనే వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇప్పటికే స్పష్టం చేశాయి.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న అన్ని చెల్లుబాటు అయ్యే కరెన్సీ నోట్లు యథావిధిగా చెల్లుబాటులోనే కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT