Loading...
US: అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఓటింగ్ విధానంలో భారీ లోపాలున్నాయా?
అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఓటింగ్ విధానంలో భారీ లోపాలున్నాయా?

US: అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఓటింగ్ విధానంలో భారీ లోపాలున్నాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ ఎన్నికల వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గురువారం రాత్రి శ్వేతసౌధం నుంచి చేసిన ప్రసంగంలో ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి విదేశీ జోక్యమే కారణమని ట్రంప్ ఆరోపించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తనను ఓడించేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన అమెరికా ఇంటెలిజెన్స్ అసెస్‌మెంట్లు, నివేదికలను ప్రజలకు బహిర్గతం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.

వివరాలు

కఠినమైన ఓటరు ఐడీ చట్టం అవసరం

దేశంలో ఎన్నికల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చాలంటే కఠినమైన ఓటరు గుర్తింపు (Voter ID) చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

"న్యాయమైన, నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశమూ గొప్పదిగా నిలవదని ఆయన వ్యాఖ్యానించారు.

మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆందోళన

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల వంటి అత్యంత కీలకమైన అంశంపై ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రమాదకరమని వారు అభివర్ణించారు.

వివరాలు

ట్రంప్ ఆరోపణలను ఖండించిన చైనా

ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా పూర్తిగా తోసిపుచ్చింది.

అమెరికా ఎన్నికల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసిన బీజింగ్, ఈ ఆరోపణలను "పూర్తిగా కల్పితం, దురుద్దేశపూరితమైనవిగా పేర్కొంది.

ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్‌కు చైనా సూచించింది.

ADVERTISEMENT