Satya Nadella: ఏఐపై పెరుగుతున్న ఆందోళనలు.. సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ దాడులు, అక్రమ నిఘా, జీవాయుధ పరిశోధనలు వంటి హానికరమైన కార్యకలాపాలకు కృత్రిమ మేధ (Artificial Intelligence)ను దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధతో ప్రమాదం పొంచి ఉందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ (Dario Amodei), ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman), ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) గతంలోనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కూడా ఇదే వాదనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
వివరాలు
కంపెనీలు చర్యలు తీసుకోవాలి
కృత్రిమ మేధ అభివృద్ధి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని, అది మనుషుల నియంత్రణలోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు.
మనం అభివృద్ధి చేస్తోన్న కృత్రిమ మేధ మానవాళికి ఉపయోగపడకపోతే, మనుషుల నియంత్రణలో లేకపోతే దానిపై ఇంకా దృష్టిపెట్టడంలో ఎలాంటి అర్థం లేదని సత్య నాదెళ్ల రాసుకొచ్చారు.
కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలని, తమ ఏఐ మోడళ్ల భద్రతను మెరుగుపరచడానికి కంపెనీలు చర్యలు తీసుకోవాలని టెక్ దిగ్గజాలు చేస్తున్న సూచనలను సత్య నాదెళ్ల సమర్థించారు.