Loading...
Ranabaali: రష్మికను చూసి ఫిదా అయిన దర్శకుడు.. 'రణబాలి' జయమ్మపై ఎమోషనల్‌ పోస్ట్
రష్మికను చూసి ఫిదా అయిన దర్శకుడు.. 'రణబాలి' జయమ్మపై ఎమోషనల్‌ పోస్ట్

Ranabaali: రష్మికను చూసి ఫిదా అయిన దర్శకుడు.. 'రణబాలి' జయమ్మపై ఎమోషనల్‌ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

వివాహం తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం 'రణబాలి'. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా టీమ్‌ షేర్‌ చేసిన ఓ వీడియోలో రష్మిక కనిపించిన లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రష్మిక 'జయమ్మ' పాత్రలో నటిస్తున్నారు. అయితే జయమ్మ పాత్ర కోసం ఆమె బేబీ బంప్‌తో కనిపించిన లుక్‌ వీడియోలో దర్శనమివ్వడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

రష్మిక పాత్రపై దర్శకుడి ఎమోషనల్‌ పోస్ట్

రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రపై దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రను తాను ఎంతో భావోద్వేగంతో రాశానని ఆయన తెలిపారు.

హీరోయిన్‌ పాత్రకు 'జయమ్మ' అనే పేరు పెట్టడానికి తన తల్లి పేరు స్ఫూర్తి అని వెల్లడించారు. ''ఈ సినిమాలోని ప్రతి పాత్రను ఎంతో భావోద్వేగంతో రాశాను.

హీరోయిన్‌ క్యారెక్టర్‌కు జయమ్మ అని మా అమ్మ పేరు పెట్టాను. ఆ జయమ్మ నేటితరం మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె డైలాగుల విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నా. రష్మిక ఈ పాత్రకు ప్రాణం పోశారు.

ఆమె ఎప్పటికీ జయమ్మగా అందరికీ గుర్తుండిపోతుందని రాహుల్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివరాలు

షూటింగ్‌ పూర్తయిందంటూ విజయ్‌ దేవరకొండ పోస్ట్

జయమ్మ పాత్రను రష్మిక అద్భుతంగా పోషించారని చెప్పిన దర్శకుడు.. ఆమె రణబాలి అనురాగానికి ప్రతిరూపంగా, నిలువెత్తు ధైర్యానికి ఆయువు పట్టుగా నిలుస్తుందని పాత్ర తీరును వివరించారు.

ఇక 'రణబాలి' చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ విజయ్‌ దేవరకొండ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను. రణబాలి, జయమ్మ పాత్రలను మిస్‌ అవుతున్నానని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్‌ దేవరకొండ చేసిన ఇదే పోస్ట్‌ను రష్మిక రీషేర్‌ చేశారు.

జయమ్మ అందరి హృదయాలను హత్తుకునే పాత్ర అని ఆమె తెలిపారు.

దీంతో 'రణబాలి'లో విజయ్‌ దేవరకొండ, రష్మిక పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

ADVERTISEMENT