
Elon Musk: మరో రెండు వారాల్లో అందుబాటులోకి గ్రోకీపీడియా బీటా వెర్షన్ : ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త సంచలనానికి తెరతీశారు. నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్ వికీపీడియా తరహాలోని కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. దీని పేరును గ్రోకీపీడియా (Grokipedia) గా తన ఎస్క్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మస్క్ ప్రకారం గ్రోకీపీడియా 0.1 బీటా వెర్షన్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానుంది. గ్రోకీపీడియా వెనుక జట్టు ఇదే ఈ ప్లాట్‌ఫామ్‌ను మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ కంపెనీ 'XAI' సిద్ధం చేస్తోంది. ఎక్స్-యూజర్ @amXFreeze ఒక పోస్టులో "మనుషులకు మరియు కృత్రిమ మేధకు ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన నాలెడ్జ్ సోర్స్. దీనికి ఎలాంటి హద్దులు లేవని వ్యాఖ్యానించారు. దీనిని మస్క్ రీపోస్ట్ చేశారు.
Details
ఫీచర్స్ & లక్ష్యాలు
ఇప్పటి వరకు గ్రోకీపీడియా ఫీచర్లను మస్క్ అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్లాట్‌ఫామ్ వాస్తవాలను వెల్లడించడం కోసం రూపొందించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే సెప్టెంబర్ నెలలో కూడా మస్క్ గ్రోకీపీడియా ప్రస్తావన చేశారు. తాజాగా దాని బీటా వెర్షన్ డేట్‌ను ప్రకటించడం విశేషం. ఈ ప్లాట్‌ఫామ్‌ను X యాప్‌తో అనుసంధానించి ఉపయోగించే అవకాశం కూడా ఉంది.