Loading...
Groww Shares: గ్రో షేర్లలో భారీ ర్యాలీ.. రూ.1,905 కోట్ల బ్లాక్ డీల్.. ఆల్‌టైమ్ గరిష్ఠానికి స్టాక్!
ఆల్‌టైమ్ గరిష్ఠానికి స్టాక్!

Groww Shares: గ్రో షేర్లలో భారీ ర్యాలీ.. రూ.1,905 కోట్ల బ్లాక్ డీల్.. ఆల్‌టైమ్ గరిష్ఠానికి స్టాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. నవంబర్ నెలలో ఇప్పటివరకు చాలా ట్రేడింగ్ సెషన్లలో సూచీలు మంచి పనితీరు కనబరిచాయి. గత వారం చివర్లో కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ.. ఈ వారం మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్లలో పెట్టుబడులు పెంచడం సూచీలకు కలిసొస్తోంది. దీంతో సోమవారం భారీ లాభాలు నమోదు చేసిన మార్కెట్లు.. మంగళవారం కూడా అదే జోరును కొనసాగించాయి. వార్త రాసే సమయానికి ఉదయం 11.50 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభంతో 82,750 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 25,450 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

స్టాక్ చరిత్రలో సరికొత్త ఆల్‌టైమ్

మార్కెట్లలో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో పలు కంపెనీల షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో (Groww) మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ షేరు ప్రత్యేకంగా నిలుస్తోంది.

మంగళవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు 3 శాతానికి పైగా లాభపడి రూ.232 స్థాయిలో కొనసాగుతోంది.

ఇంట్రాడేలో ఒక దశలో 4 శాతం వరకు పెరిగి రూ.233.40 వద్దకు చేరుకుంది. ఈ ధరే స్టాక్ చరిత్రలో సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠం కావడం విశేషం.

గతేడాది నవంబరులో స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఈ కంపెనీ షేరు.. ప్రస్తుతం మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో గత కొన్ని సెషన్లుగా మంచి ర్యాలీ చేస్తోంది.

వివరాలు 

50 శాతానికి పైగా లాభం 

తాజాగా మరోసారి సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత నెల రోజుల్లోనే ఈ షేరు ధర 17 శాతానికి పైగా పెరిగింది.

ఆరు నెలల కాలంలో 27 శాతం రాబడిని అందించగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 50 శాతానికి పైగా లాభపడింది.

ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.44 లక్షల కోట్లకు చేరింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.142.11గా ఉంది.

గ్రో షేర్లు గతేడాది నవంబర్ 12న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి.

కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.100గా ఉండగా.. ఎన్ఎస్ఈలో 10 శాతానికి పైగా ప్రీమియంతో రూ.112 వద్ద లిస్టింగ్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ షేరు క్రమంగా పుంజుకుంటూ వస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.1,905 కోట్ల బ్లాక్ డీల్.. భారీగా చేతులు మారిన షేర్లు

నవంబర్ 17న గ్రో షేరు భారీగా పెరగడానికి స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులతో పాటు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది.

అదే భారీ బ్లాక్ డీల్. మంగళవారం ట్రేడింగ్‌కు ముందు ప్రీ-ఓపెన్ సెషన్‌లో ఈ లావాదేవీ జరిగింది.

ఈ బ్లాక్ డీల్‌లో సుమారు 8.7 కోట్ల గ్రో షేర్లు చేతులు మారాయి. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ వాటాలో దాదాపు 1.4 శాతానికి సమానం.

ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1,905 కోట్లుగా ఉంది. ఒక్కో షేరును సగటున రూ.219 ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

రూ.1,905 కోట్ల బ్లాక్ డీల్.. భారీగా చేతులు మారిన షేర్లు

అయితే సోమవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఈ లావాదేవీ ధర సుమారు 2.6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.

ఈ భారీ లావాదేవీలో షేర్లను విక్రయించినవారు, కొనుగోలు చేసినవారి వివరాలు మాత్రం వెల్లడికాలేదు.

ఈ బ్లాక్ డీల్‌తో పాటు మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతుండటంతో గ్రో షేరు మరింత పుంజుకుని ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT