Groww IPO Listing: గ్రో IPO లిస్టింగ్.. దలాల్ స్ట్రీట్‌లో శుభారంభం - 14% ప్రీమియంతో గ్రో షేర్ల ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యింది. సంస్థ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో బీఎస్‌ఈలో 14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇష్యూ ధర రూ.100గా నిర్ణయించగా, ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం ప్రీమియంతో రూ.112 వద్ద ట్రేడింగ్ మొదలైంది. బీఎస్‌ఈలో రూ.114 వద్ద షేర్లు లిస్టయ్యాయి. రూ.6,632 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా ఈ సంస్థ నవంబర్ 4న పబ్లిక్ ఇష్యూ (IPO) విడుదల చేసింది. మొత్తం 36.47 కోట్ల షేర్లు పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంచగా, వాటికి 641.86 కోట్ల షేర్లకు సమానమైన బిడ్లు వచ్చాయి.
వివరాలు
1.26 కోట్లకుపైగా క్రియాశీల ఖాతాదారులు ఉన్న గ్రో
కంపెనీ ధరల శ్రేణిని రూ.95 నుండి రూ.100 వరకు నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.1,060 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయగా, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయించబడ్డాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 9.43 శాతం సబ్‌స్క్రిప్షన్, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) కోటా 14.20 రెట్లు సబ్‌స్క్రైబ్, అలాగే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIB) విభాగం 22.02 రెట్లు స్పందన అందుకుంది. 2016లో స్థాపించబడిన గ్రో, ప్రస్తుతం 1.26 కోట్లకుపైగా క్రియాశీల ఖాతాదారులను కలిగి ఉంది. 2025 జూన్ నాటికి కంపెనీకి 26 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా ఉంది, దీని వలన అది భారతదేశంలో అతిపెద్ద స్టాక్ బ్రోకర్‌గా నిలిచింది.