
GST: జీఎస్టీ 2.0లో ఆల్కహాల్, గేమింగ్, సిగరెట్లపై జీఎస్టీ 40 శాతం పన్ను?
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త జీఎస్టీ 2.0 వ్యవస్థలో భాగంగా మద్యం, సిగరెట్లు, గేమింగ్ వంటి రంగాలపై భారీ పన్ను భారం పడే అవకాశం ఉంది. "సిన్ ట్యాక్స్" పేరిట 40% వరకు పన్ను విధించాలని సెంట్రల్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మార్కెట్లో సంబంధిత షేర్లు కూడా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త జీఎస్టీ రీఫార్మ్స్ ప్రకారం, పన్ను నిర్మాణం రెండు ప్రధాన స్లాబ్‌లుగా విభజించనున్నారు. అవసరమైన వస్తువులకు 5% జీఎస్టీ, ఎక్కువ వస్తువులకు 18% జీఎస్టీ ఉండనుంది. అయితే విలాస వస్తువులు, సిన్ గూడ్స్ (అల్కహాల్, టొబాకో, జూదం సంబంధిత వస్తువులు)పై ప్రత్యేకంగా 40% జీఎస్టీ విధించాలని ప్రతిపాదన ఉంది.
పన్ను వివరాలు
'సిన్ ట్యాక్స్' అంటే ఏమిటి?
'సిన్ ట్యాక్స్' అనేది సమాజానికి హానికరంగా భావించే వస్తువులపై విధించే ప్రత్యేక ఎక్సైజ్ పన్ను. సాధారణంగా సిగరెట్లు, మద్యం, గేమింగ్, వేయ్పింగ్ లాంటి ఉత్పత్తులపై ఈ పన్ను వేస్తారు. ఈ పన్నుతో వచ్చే ఆదాయం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించబడుతుంది. మరోవైపు, ధర పెరగడం వల్ల వినియోగం తగ్గించడమే ఈ పన్ను లక్ష్యంగా ఉంటుంది.
రేటు స్థిరత్వం
ప్రత్యేక పన్నుల్లో మార్పుల్లేవు
కొత్త జీఎస్టీ నిర్మాణంలో కొన్ని ప్రత్యేక పన్ను రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. వజ్రాలు, విలువైన రత్నాలపై 0.25% పన్ను అలాగే కొనసాగుతుంది. బంగారు నగలపై 3% పన్ను కొనసాగించనున్నారు. దీంతో ఈ రంగాల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది.