LOADING...
GST collections: నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు
నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు

GST collections: నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నవంబర్ నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగాయి. ఆ నెలలో మొత్తం జీఎస్టీగా రూ.1,70,276కోట్లను వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే కేవలం 0.7శాతం మాత్రమే వృద్ధి కనిపించినట్టుగా పేర్కొంది. గతేడాది నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.69లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయస్థాయిలో జీఎస్టీ ఆదాయం తగ్గడం వల్ల వసూళ్ల వృద్ధి ఆశించినంత స్థాయిలో లేకపోయింది. సెప్టెంబర్‌ 22న దాదాపు 375ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఆనిర్ణయం ప్రభావంతో దేశీయ జీఎస్టీ ఆదాయం 2.3శాతం క్షీణించి రూ.1.24లక్షల కోట్లకే పరిమితమైంది. అయితే దిగుమతులపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10.2శాతం వృద్ధితో రూ.45,976కోట్లకు చేరుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు

Advertisement