LOADING...
H-1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు.. భారత కంపెనీలపై ప్రభావమెంత..? 
హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు.. భారత కంపెనీలపై ప్రభావమెంత..?

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు.. భారత కంపెనీలపై ప్రభావమెంత..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా హెచ్‌-1బీ వీసాల జారీ విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అధిక నైపుణ్యం కలిగి, ఎక్కువ వేతనం పొందే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఈ తాజా నిబంధనల వల్ల భారత ఐటీ సంస్థలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలు అమెరికాలో స్థానిక ఉద్యోగుల నియామకంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల వెల్లడైన త్రైమాసిక ఫలితాలు, కంపెనీల ప్రకటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వివరాలు 

హెచ్‌-1బీ నియామకాలపై భారత ఐటీ కంపెనీల ధోరణి 

అమెరికాలో హెచ్‌-1బీ వీసా ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడిన సంస్థల్లో టీసీఎస్‌ (TCS) అగ్రస్థానంలో ఉందన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం దాదాపు 5,500 మందిని ఈ వీసాల ద్వారా నియమించుకుంది. అయితే ట్రంప్‌ పాలనలో విధించిన ఆంక్షలు, ఇతర కారణాల నేపథ్యంలో ఈ ఏడాది నియామకాలను భారీగా తగ్గించింది. ఈసారి కేవలం 500 మందికే హెచ్‌-1బీ వీసాలపై అవకాశం ఇచ్చింది. ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో తమ సంస్థలో ఎక్కువ మంది ఉద్యోగులు స్థానికులేనని, హెచ్‌-1బీ ఉద్యోగులను పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకుంటున్నామని సంస్థ వెల్లడించింది.

వివరాలు 

హెచ్‌-1బీ నియామకాలపై భారత ఐటీ కంపెనీల ధోరణి 

విప్రో విషయానికి వస్తే, అమెరికాలోని తమ కార్యాలయాల్లో సుమారు 80 శాతం మంది స్థానిక ఉద్యోగులే పనిచేస్తున్నారని తెలిపింది. గత ఐదేళ్లలో కేవలం 250 మంది హెచ్‌-1బీ ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఈ ఏడాది భారత్‌ నుంచి అమెరికాకు 250 నుంచి 300 మంది వరకు హెచ్‌-1బీ వీసాలపై తరలించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థలు హెచ్‌-1బీ నియామకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Advertisement

వివరాలు 

నష్టాల్లో ఐటీ షేర్లు 

అమెరికా తీసుకురాబోయే కొత్త హెచ్‌-1బీ నిబంధనల ప్రకటన ప్రభావంతో భారత స్టాక్‌ మార్కెట్‌లో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. టెక్‌ మహీంద్రా, విప్రో, కోఫోర్జ్‌ షేర్లు 0.7 శాతం నుంచి 1 శాతం వరకు పడిపోయాయి. ఇన్ఫోసిస్‌ షేరు సుమారు 0.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక టీసీఎస్‌ షేర్లు స్వల్ప ఊగిసలాటతో సాగుతున్నాయి.

Advertisement