
Stock Market Today: హెచ్-1బీ వీసా ఎఫెక్టు.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. హెచ్-1బీ వీసా ఆందోళనల ప్రభావంతో సూచీలలో ప్రతికూల సెంటిమెంట్ కొనసాగుతోంది. ఉదయం 9.31 గంటలప్పుడు సెన్సెక్స్ 344 పాయింట్లు కోల్పోయి 81,757 వద్ద కదలాడగా, నిఫ్టీ 106 పాయింట్లు తగ్గి 25,063 వద్ద ట్రేడవుతోంది. ఏ షేర్లు లాభాల్లో, ఏవీ నష్టాల్లో? నిఫ్టీ సూచీలో ట్రెంట్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి.
Details
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకు కలిగించే అంశం
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు తగ్గి 88.80 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఎగుమతిదారులు దీన్ని తాత్కాలికంగా ప్రయోజనంగా భావిస్తున్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఆందోళన కలిగించే అంశంగా ఉంది. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటి తరవాత, ఆసియా మార్కెట్లు మిశ్రమ సెంటిమెంట్‌తో కదలుతున్నాయి.
Details
హెచ్-1బీ వీసా పరిణామాలు
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచింది. వీటికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించడంలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతించడం, అమెరికన్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీజు పెంపుతో కెరీర్లు గాడిద తప్పవచ్చని, కమ్యూనిటీలు అస్థిరంగా మారవచ్చని ప్రవాస భారతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.