HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలర్ట్.. జనవరి 11న సేవల్లో తాత్కాలిక అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా బ్యాంకుల సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడుతుంటాయి. సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా కొన్ని గంటల పాటు పలు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఇదే నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. బ్యాంక్ సేవల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని ముందుగానే తెలియజేసింది. సాధారణంగా ఇలాంటి మెయింటెనెన్స్ పనుల గురించి బ్యాంక్ ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వినియోగదారులకు సమాచారం అందిస్తుంది. అందుకే బ్యాంక్ నుంచి వచ్చే సందేశాలను గమనించడం అవసరమని సూచించింది.
Details
రెండు గంటల పాటు అంతరాయం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటన ప్రకారం, జనవరి 11వ తేదీ తెల్లవారు జామున 12 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు, అంటే మొత్తం రెండు గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌కు సంబంధించిన సేవలు పనిచేయవని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే ఈ సమయంలో వినియోగదారులు వాట్సాప్ ద్వారా నెట్‌బ్యాంకింగ్ సేవలు, పేజాప్ (PayZapp), చాట్‌బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంకు సిస్టమ్స్ నిర్వహణలో భాగంగానే ఈ రెండు గంటల పాటు సేవల్లో అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది.
Details
ఖాతాదారులు అర్థం చేసుకోవాలి
మెయింటెనెన్స్ పనుల కారణంగా ఏర్పడే ఈ అంతరాయాన్ని ఖాతాదారులు అర్థం చేసుకుని సహకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కోరింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను పెంచడం, అలాగే వినియోగదారులకు మరింత సున్నితమైన మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడమే ఈ మెయింటెనెన్స్ పనుల ప్రధాన లక్ష్యమని బ్యాంక్ వివరించింది.