HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. నెట్ బ్యాంకింగ్, యాప్ సేవలకు తాత్కాలిక బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ఈ నెల నవంబర్ 23, 2025న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ముందుగానే కస్టమర్లకు మెసేజ్ ద్వారా తెలియజేశామని మేనేజ్మెంట్ తెలిపింది. కస్టమర్లు దీనికి అనుగుణంగా తమ పనులను ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. నిర్దిష్ట సమయంలో నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయడం వెనుక కారణాన్ని వెల్లడించిన బ్యాంక్— తమ నెట్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరచడం, అప్‌డేట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
Details
నాలుగు గంటల పాటు నెట్ బ్యాంకింగ్ నిలిపివేత
ఈ సమయంలో బ్యాంక్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. నవంబర్ 23న మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన వినియోగదారులు బ్యాంక్ బ్రాంచ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, పే యాప్, మై కార్డ్స్, వాట్సాప్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. తమ సేవల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రక్రియలో కస్టమర్లకు కొంత అసౌకర్యం కలగొచ్చని, అందరూ సహకరించాలని బ్యాంక్ విజ్ఞప్తి చేసింది.