
Zomato: జొమాటోలో 'హెల్తీమోడ్' ప్రారంభం:.. ఆరోగ్యకర ఆహారం ఎంచుకోవడం ఇక సులభమే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులకు ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ చేసే సమయంలో ఆహారంలోని పోషక విలువలను బట్టి ఎంచుకునే అవకాశం ఉండేలా హెల్తీమోడ్ (Healthy Mode)ను ప్రారంభించింది. ఈ మోడ్ ద్వారా ఎంచుకున్న వంటకంలోని పోషక విలువల రేటింగ్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ X వేదికపై వివరించారు. వినియోగదారులు ఆహారం ఆర్డర్ చేయడాన్ని జొమాటో సులభతరం చేసింది, కానీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంపై స్పష్టమైన సమాచార సదుపాయం అందలేదు.
Details
ప్రతి వంటకానికీ ఒక స్కోరు
ఈ లోపాన్ని తీర్చేందుకు 'హెల్తీమోడ్'ను పరిచయం చేస్తున్నాం. ప్రతీ వంటకానికి ఒక స్కోర్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ ఆధారంగా లో-సూపర్ స్కోర్‌ను చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది గురుగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఇతర నగరాల్లో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం. వినియోగదారులు దీన్ని ప్రయత్నించి, లోపాలు ఉంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరు. మా మిషన్ 'Better Food for More People'కి ఇది దగ్గరగా ఉందని తెలిపారు.
Details
వినియోగదారుల ఆరోగ్యానికి ఆధిక ప్రాధాన్యాత
అంతే కాకుండా ప్రొఫెషనల్ అథ్లెట్లు కూడా ఆధారపడే విధంగా హెల్తీమోడ్ రూపొందించారు. జొమాటో గతంలోనూ వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఉదాహరణకి మీరు నాన్ వంటకానికి బదులుగా రోటీని ఎంచుకోవాలని ఆప్షన్ చూపించడం, లేదా తక్కువ కేలరీలతో స్వీట్ ఎంపిక చేసుకోవడం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని గోయల్ పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఆరోగ్యపరంగా మంచి ఆహారాన్ని సులభంగా ఎంచుకునే అవకాశం పొందుతున్నారు.