Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు
బంగారం, వెండి, ప్లాటినంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. ఒక్కరోజులోనే కిలోకు రూ.6.20లక్షల మేర క్షీణించడం విశేషం. మరోవైపు కిలో వెండి ధరపై కూడా రూ. 3వేలు తగ్గింది. ఇప్పటివరకూ బంగారం, వెండిపై 10శాతం బీసీసీ ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 5శాతం చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మౌలిక వసతుల అభివృద్ధి సుంకం 5శాతం నుంచి 1శాతానికి పరిమితం చేశారు.
పది గ్రాముల బంగారం 71,300
బంగారం, వెండిపై 15శాతంగా ఉన్న సుంకాల భారాన్ని 6శాతానికి తగ్గించారు. అదే విధంగా ప్లాటినంపై 15 శాతం నుంచి 6.40 శాతానికి దిగజారింది. ఇక ప్లాటినంపై ఉన్న భారాన్ని కూడా 18 శాతం నుంచి 9.40 శాతానికి తగ్గించారు. బంగారం ఒక్కసారిగా 9శాతం కోత పడటంతో మేలిమి బంగారం రూ.77.50 లక్షల నుంచి రూ.71.30 లక్షలకు పడిపోయింది. పది గ్రాములు రూ.77,500 నుంచి రూ.71,300కు తగ్గింది.