Hermes Heir: పని మనిషికి రూ.97వేల కోట్లు రాసివ్వనున్న బిలియనీర్ ఎవరో తెలుసా?
స్విట్జర్లాండ్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ వ్యవస్థాపకుడు థియెర్రీ హెర్మెస్ మనవడు, బిలియనీర్ నికోలస్ ప్యూచ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తన మంచి మనసును చాటుకున్నారు. 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ తన ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిని దత్తత తీసుకొని, తన 11 బిలియన్ డాలర్ల (రూ.97వేల కోట్లు)విలువై ఆస్తిని అతనికి రాసివ్వాలని నిర్ణయించుకున్నట్లు స్విట్జర్లాండ్ మీడియా సంస్థ 'ట్రిబ్యూన్ ది జెనీవ్ ఫార్చ్యూన్ట పేర్కొంది. నికోలస్ ప్యూచ్‌కు వివాహం కాలేదు. అతనికి ఎలాంటి సంతానం లేదు. దీంతో నికోలస్ వేల కోట్ల ఆస్తికి ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్రమైన చర్చ జరిగింది. ఈ క్రమంలో నికోలస్ తన ఇంట్లో పని చేస్తున్న వ్యక్తికి రాసివ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చాలా ఏళ్లుగా నికోలస్ బాగోగులను చూసుకుంటున్న పని మనిషి
స్పానిష్ మహిళను వివాహం చేసుకున్న 51 ఏళ్ల పని మనిషి నికోలస్ ఇంట్లో తోటమాలిగా పని చేస్తున్నారు. చాలా ఏళ్లుగా నికోలస్ బాగోగులను ఆ తోటమాలి చూసుకుంటున్నాడు. ఇప్పటికే తోటమాలికి 5.9మిలియన్ డాలర్ల ఆస్తులను నికోలస్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతా ఆస్తులను కూడా అప్పగించేందుకు నికోలస్ ఒక న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. చట్టప్రకారం తోటమాలిని దత్తత తీసుకున్న తర్వాత అతడికి దాదాపు రూ.97వేల కోట్ల ఆస్తులను రాసివ్వనున్నట్లు స్విస్ మీడియాలో కథనాలు వెలువెత్తుతున్నాయి. అయితే తన కుటుంబంలో నెలకొన్న తగాదాల వల్లే నికోలస్ తన ఆస్తులను పని మనిషికి రాసివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమచారం.