LOADING...
Busines Idea : మహిళలకు శుభవార్త..భారీగా ఆదాయం పొందండిలా
మహిళలకు శుభవార్త..భారీగా ఆదాయం పొందండిలా

Busines Idea : మహిళలకు శుభవార్త..భారీగా ఆదాయం పొందండిలా

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో నుంచే ప్రారంభించగలిగే చిన్న స్థాయి తయారీ వ్యాపారాలపై ఆసక్తి పెరుగుతోంది. అలా వ్యాపారం చేయాలనుకునేవారు తక్కువ పెట్టుబడితో పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం ప్రారంభించొచ్చు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధిస్తున్న నేపథ్యంలో పేపర్ బ్యాగ్‌లకు మార్కెట్‌లో వేగంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం స్థానిక దుకాణాలు, మెడికల్ షాపులు, బేకరీలు, రెడీమేడ్ దుస్తుల దుకాణాలు, గిఫ్ట్ షాపులు వంటి అనేక వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ సంచుల స్థానంలో పేపర్ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఈ కారణంగా చిన్న స్థాయిలో తయారీ ప్రారంభించినా కూడా విక్రయ అవకాశాలు విస్తృతంగా ఉంటాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

వివరాలు

ఇలా ప్రారంభించొచ్చు..

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. సుమారు రూ.5,000 నుంచి రూ.15,000 మధ్య పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ప్రారంభంలో మహిళలు ఇంట్లోనే చేతితో పేపర్ బ్యాగ్‌లు తయారు చేయవచ్చు. తరువాత వ్యాపారం అభివృద్ధి చెందితే చిన్న మెషిన్ కొనుగోలు చేసి ఉత్పత్తిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు

తయారీ ఇలా

ఒక పేపర్ బ్యాగ్ తయారీకి సాధారణంగా రూ.2 నుంచి రూ.4 వరకు ఖర్చవుతుంది. అదే బ్యాగ్‌ను మార్కెట్‌లో రూ.6 నుంచి రూ.10 వరకు విక్రయించవచ్చు. రోజుకు సుమారు 100 నుంచి 200 బ్యాగ్‌లు తయారు చేస్తే మహిళలకు మంచి ఆదాయం వచ్చే అవకాశముందని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి సాధించాలని కోరుకునే మహిళలకు పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం మంచి అవకాశంగా మారుతోందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement