Home Loan vs SIP Investment: కొత్త ఇంటి కోసం హోమ్ లోన్ మంచిదా సిప్ ఇన్వెస్ట్‌మెంటా.. ఏది బెస్ట్ ఆప్షన్?
ఈ రోజుల్లో ఇల్లు కొనడం లేదా నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొన్నేళ్ల పాటు సేవింగ్స్ లేదా పెట్టుబడితోనే ఇల్లు కొనడం సాధ్యం అవుతుంది. అందుకే చాలా మంది హోమ్ లోన్‌పై ఆధారపడతారు. మరోవైపు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిప్ చేసి ఆ రిటర్న్స్‌తో ఇల్లు కొనాలని ప్రణాళిక చేస్తుంటారు. అయితే, హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐలు చెల్లించడం మంచిదా? లేక పెట్టుబడి పెట్టడం ద్వారా కార్పస్ బిల్డ్ చేయడం బెటర్ ఆప్షనా అనే విషయంలో స్పష్టత కావాలి. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఉత్తమమో వివరంగా పరిశీలిద్దాం.
సొంత ఇంటి ప్రయోజనాలు:
సొంత ఇల్లు ఒక ఆస్తి మాత్రమే కాకుండా, అద్దె ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాక, ఇది భావోద్వేగ సురక్షితతను అందిస్తుంది. పన్ను ప్రయోజనాలు పొందడం కూడా సొంత ఇంటి కొనుగోలుకు తోడ్పడుతుంది. సొంత ఇంటి ఖర్చులు: ఇల్లు కొనుగోలు చేయడంలో కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు, ఆస్తి పన్నులు, ముందస్తు ఖర్చులు వంటి విషయాలు అధిక భారంగా ఉంటాయి. అలాగే, భవిష్యత్తులో వేరే ప్రాంతానికి మారాల్సి వస్తే ఇబ్బందులు తలెత్తవచ్చు. కొన్నిసార్లు కాలక్రమేణా ఆస్తి విలువ తగ్గే అవకాశమూ ఉంటుంది.
వయస్సు:
ఇల్లు కొనుగోలు చేయడంలో వయస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. యువ వయస్సులో ఎక్కువ పని సంవత్సరాలు ఉంటాయి, అందువల్ల హోమ్ లోన్ తీసుకోవడం ఆర్థికంగా సులభం. అయితే, వయస్సు పెరిగే కొద్దీ పని సంవత్సరాలు తగ్గుతాయి, కాబట్టి అప్పుడు పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. పెట్టుబడి ఆలస్యం: పెట్టుబడిని ఆలస్యం చేస్తే, కాంపౌండింగ్ ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే, హోమ్ లోన్ తీసుకున్నప్పటికీ, చిన్న మొత్తంలో పెట్టుబడులు చేయడం ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవచ్చు.
ఫలితం:
ఇది వ్యక్తి ఆర్థిక పరిస్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఆదాయం, వ్యక్తిగత లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ నిర్ణయం తీసుకోవాలి. హోమ్ లోన్ కాలిక్యులేషన్: ఉదాహరణకు, రూ.55 లక్షల హోమ్ లోన్ తీసుకున్నట్లు భావిద్దాం. 9.5% వడ్డీ రేటుతో, 25 సంవత్సరాల కాలపరిమితి ఉంటే, ప్రతినెలా రూ.48,053 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం చెల్లింపు రూ.1.44 కోట్లు, ఇందులో వడ్డీ రూపంలో రూ.89 లక్షలు కేవలం వడ్డీగా వెళుతుంది.
సిప్ ఇన్వెస్ట్‌మెంట్:
అదే 25 సంవత్సరాలు సిప్ చేయగా, నెలకు రూ.18,333 పెట్టుబడి చేస్తే, 12% రిటర్న్స్‌తో మొత్తం రూ.3.47 కోట్లు కార్పస్ పొందవచ్చు. చిన్నకాలంలో ఈ మొత్తం తక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో అదనపు ఆదాయం పొందవచ్చు. ఇంటి భవిష్యత్తు ధర: ప్రస్తుతం రూ.55 లక్షల ఇంటి ధర, 5% వార్షిక పెరుగుదలతో, 20 సంవత్సరాల్లో రూ.1.61 కోట్లకు పెరగవచ్చు. దీని వల్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవడం ముఖ్యం. ఇదంతా చూస్తే, హోమ్ లోన్ లేదా సిప్ అనేది వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా నిర్ణయించుకోవాలి.