LOADING...
Hyderabad Housing Sales Report: హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..? 
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..?

Hyderabad Housing Sales Report: హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ ఇళ్ల మార్కెట్‌ దారుణపరిస్థితిని ఎదుర్కొంటోంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ ప్రకారం, ఈ ఏడాది మొత్తం ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 5 శాతం తక్కువగా ఉండవచ్చని అంచనా. 58,540 యూనిట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేయగా, గత ఏడాది ఈ సంఖ్య 61,715 యూనిట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు ఏడు ప్రధాన నగరాల్లో కూడా ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి 4.6 లక్షల యూనిట్లుగా ఉండవచ్చని అనరాక్‌ నివేదిక పేర్కొంది. అయితే, గతేడాదితో పోల్చితే అమ్మకాల విలువ 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.

వివరాలు 

ఇంటి సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం

ఇంటి సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగినట్లు వెల్లడించారు. దీనికి భూముల ధరల పెరుగుదల, కార్మికుల వేతనాల వృద్ధి, ముడి సరుకుల ధరల పెరుగుదల వంటి అంశాలు కారణమని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ సంబంధిత అనుమతుల్లో జాప్యం కారణంగా కొత్త హౌసింగ్‌ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించింది. ఈ కారణంగా ఇళ్ల ధరలు పెరిగినా, అమ్మకాల విలువ మాత్రం అధికంగా నమోదైంది. భారత హౌసింగ్‌ రంగం 2024లో మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొంటోందని, ధరల పెరుగుదల వల్ల అమ్మకాల విలువ 16 శాతం పెరిగిందని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.

వివరాలు 

సరఫరాలో తగ్గుదల

➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7శాతం తగ్గి 4,12,520 యూనిట్లుగా ఉండవచ్చని అంచనా. ➤ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో అమ్మకాలు 6శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉండవచ్చని అంచనా. గతేడాది 65,625 యూనిట్లు విక్రయమయ్యాయి. ➤ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు. ➤ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండవచ్చని అంచనా. ➤ పూణేలో అమ్మకాలు 6శాతం తగ్గి 81,090 యూనిట్లుగా నమోదవుతాయని అంచనా. ➤ కోల్‌కతాలో అమ్మకాలు 20శాతం తగ్గి 18,335 యూనిట్లకు పరిమితం కావచ్చు. ➤ చెన్నైలో అమ్మకాలు 11శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.