LOADING...
EAC-PM: కుటుంబాల వినియోగ ధోరణిలో మార్పు.. వాహనాలు,గృహోపకరణాల కొనుగోలే ఎక్కువ: EAC-PM సర్వే
వాహనాలు,గృహోపకరణాల కొనుగోలే ఎక్కువ: EAC-PM సర్వే

EAC-PM: కుటుంబాల వినియోగ ధోరణిలో మార్పు.. వాహనాలు,గృహోపకరణాల కొనుగోలే ఎక్కువ: EAC-PM సర్వే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కుటుంబాల ఖర్చు విధానాల్లో పెద్ద మార్పు చోటు చేసుకుంటోందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) తాజా సర్వే నివేదిక వెల్లడించింది. అవసరమైన వస్తువులపై ఖర్చు తగ్గించి, దీర్ఘకాలం ఉపయోగించే డ్యూరబుల్ ఆస్తులపై పెట్టుబడులు పెట్టే ధోరణి కుటుంబాల్లో పెరిగిందని నివేదిక చెబుతోంది. ప్రత్యేకంగా, కుటుంబాలు దుస్తులు, పాదరక్షలు వంటి ప్రాధమిక అవసరాల కంటే వ్యక్తిగత వస్తువులు, కుకింగ్ & గృహోపకరణాలపై ఖర్చు పెంచుతున్నాయయి, ఈ ధోరణి దిగువ 40% ఆదాయ వర్గాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. "దుస్తులు, పాదరక్షలు లాంటి ప్రాథమిక అవసరాలకంటే వ్యక్తిగత వస్తువులు, వంటసామగ్రి, గృహోపకరణాలలాంటి ఆస్తుల నిర్మాణపు ఖర్చులపై కుటుంబాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి" అని నివేదిక పేర్కొంది.

వివరాలు 

కుటుంబాలు ఆస్తులపై ఎందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి? 

ఈ మార్పుకు పెరుగుతున్న అవగాహన, మెరుగైన ఆర్థిక సౌకర్యాలు, మార్కెట్ కనెక్టివిటీ వంటి అంశాలు కారణమని నివేదిక చెబుతోంది. ఇవన్నీ జీవన ప్రమాణాలు, ఉత్పాదకతలో మెరుగుదలకు దోహదపడుతున్నాయి.

వివరాలు 

భారతీయులు ఏం కొనుగోలు చేస్తున్నారు? 

2011-12, 2023-24 గృహ వినియోగ ఖర్చుల సర్వేల ఆధారంగా చేసిన విశ్లేషణలో, దేశంలో వేగంగా పెరుగుతున్న డ్యూరబుల్ ఆస్తుల్లో మోటార్ వాహనాలు అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల నగర-గ్రామ ప్రాంతాల మధ్య గ్యాప్ తగ్గుతుందనే విషయాన్ని కూడా సూచిస్తోంది. ముఖ్యంగా దిగువ 40%వర్గాల్లో వాహనాలు కొనుగోలు చేసే సామర్థ్యం గణనీయంగా పెరిగింది. రోడ్ల మౌలిక సదుపాయాల మెరుగుదల, మార్కెట్ యాక్సెస్ పెరగడం, వాహన రుణాల లభ్యత వంటి కారణాలు దీనికి కారణమని నివేదిక అంటోంది. ఇంకా, టెలివిజన్ మాత్రం ఇతర డ్యూరబుల్ ఆస్తులతో పోలిస్తే మందగమనంలో ఉందని సర్వే చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో మొత్తం జనాభా,దిగువ 40% వర్గాల్లో టీవీ వినియోగం తగ్గిందని నివేదిక పేర్కొంది.

వివరాలు 

ప్రజలు కంటెంట్‌ను చూడటంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు

మొబైల్ ఫోన్ వినియోగం విస్తృతమవడం వల్ల ప్రజలు కంటెంట్‌ను చూడటంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. సమాచారం, వినోదం కోసం ప్రధాన ఆధారం టీవీ నుంచి మొబైల్ వైపు మారుతున్నదని నివేదిక హైలైట్ చేసింది. మోటార్ వాహనాల యాజమాన్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాప్ తగ్గుతుండగా, పట్టణాల్లో ఈ మార్పు మరింత వేగంగా పెరుగుతోంది. ఫ్రిజ్ కూడా ఇలాగే పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు పెద్దమొత్తంలో దోహదపడ్డట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్లు దేశంలో అత్యంత సమానంగా ప్రాచుర్యం పొందిన డ్యూరబుల్ ఆస్తులుగా నిలిచాయి.

వివరాలు 

భారీగా పెరిగిన గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఫ్రిజ్ వినియోగం

పై 20%, దిగువ 40% వర్గాల్లో కూడా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫ్రిజ్ వినియోగం భారీగా పెరిగింది. గ్రామాల్లో దిగువ 40% వర్గాల్లో ఫ్రిజ్ యాజమాన్యం ఏడు రెట్లు పెరిగితే, పై 20% వర్గాల్లో అది రెండింతలు పెరిగింది. మరింతగా, గ్రామీణ-పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ బహుళ రకాల ఆస్తులు కలిగి ఉన్న కుటుంబాల శాతం పెరిగిందని, దీంతో వర్గాల మధ్య వినియోగ అసమానతలు తగ్గుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడంతా చూసుకుంటే, డ్యూరబుల్ ఆస్తులేమీ లేని కుటుంబాలు 5% కంటే తక్కువగా మాత్రమే ఉండటం, ఆస్తి పేదరికం చాలా వరకు తగ్గిపోయిందని నివేదిక చెబుతోంది.

వివరాలు 

డ్యూరబుల్ ఆస్తుల యాజమాన్యం ఎందుకు కీలకం? 

అలాంటి ఆస్తులు ఆధునిక జీవన ప్రమాణాలకు దారి తీస్తాయి. సమయ నిర్వహణ, మహిళల ఉద్యోగాల్లో పాల్గొనడం, ఉత్పాదకత, పనిచేసే అవకాశాలు వంటి రంగాల్లో సానుకూల మార్పులకు దోహదపడతాయని నివేదిక తెలిపింది.