LOADING...
GST 2.0: జీఎస్టీ 2.0 పన్నులను ఎలా సులభతరం చేసి.. వినియోగాన్ని ఎలా పెంచుతుంది? 
జీఎస్టీ 2.0 పన్నులను ఎలా సులభతరం చేసి.. వినియోగాన్ని ఎలా పెంచుతుంది?

GST 2.0: జీఎస్టీ 2.0 పన్నులను ఎలా సులభతరం చేసి.. వినియోగాన్ని ఎలా పెంచుతుంది? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మార్పులతో పన్ను వర్గీకరణ సులభతరం అవుతుందని, ఉత్పత్తులపై పన్ను రేట్ల విషయంలో తరచుగా వచ్చే వివాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. జీఎస్టీ 2.0 బ్లూప్రింట్ ప్రకారం పన్ను నిర్మాణాన్ని రెండు ప్రధాన రేట్లకే పరిమితం చేయనున్నారు. అవసరమైన వస్తువులకు 5 శాతం, మిగతా చాలా సరుకులు, సేవలకు 18 శాతం. ఇక లగ్జరీ, సిగరెట్లు, మద్యం వంటి 'సిన్ ప్రోడక్ట్స్'కి ప్రత్యేకంగా 40 శాతం రేటు అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పన్ను సరళీకరణ 

వివాదాలు తగ్గించేందుకు కొత్త రేట్లు 

ప్రస్తుతం ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలకు 12% పన్ను, ప్యాక్‌ చేయని వాటికి 5% పన్ను ఉండటంతో వినియోగదారులు అయోమయం అవుతున్నారు. కొత్త రెండు రకాల పన్ను నిర్మాణంతో ఇలాంటి భిన్నతలు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఎసెన్షియల్ ఐటమ్స్లో ఏవి చేరుతాయో ఇంకా స్పష్టత రాలేదు.

ఆటో రంగంపై ప్రభావం 

ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం 

కొత్త జీఎస్టీ రేట్ల ప్రభావం ఆటోమొబైల్ రంగంపై ఎక్కువగా కనిపించనుంది. చిన్న ఇంజిన్ కార్లు ప్రస్తుతం ఉన్న 28% పన్ను బరువునుంచి 18%కి మారే అవకాశం ఉంది. అధిక స్థాయి కార్లు 40% రేటులోకి వెళ్ళినా, ప్రస్తుతం అమలులో ఉన్న కాంపెన్సేషన్ సెస్ (17-22%) తొలగించబడతందువల్ల మొత్తం పన్ను భారం తగ్గుతుంది.

నిపుణుల అభిప్రాయం 

ప్రతిపాదిత జిఎస్‌టి సవరణ సరైన చర్య అంటున్న నిపుణులు  

డెలాయిట్ ఇండియాకు చెందిన పన్ను నిపుణుడు ఎం.ఎస్.మణి మాట్లాడుతూ.. "ప్రతిపాదిత జీఎస్టీ మార్పులు సరైన దిశలో వేసిన అడుడు. ఈ వ్యాపార వర్గాలు ఈ సంస్కరణలపై ఆశావహంగా ఉన్నాయి. వర్గీకరణపై తలెత్తే వివాదాలు తగ్గడంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది" అన్నారు. అలాగే బీడీఓ ఇండియాకు చెందిన కార్తిక్ మణి కూడా రెండు రకాల పన్ను నిర్మాణం వల్ల ఉత్పత్తుల వర్గీకరణలో తలెత్తే సమస్యలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

ఉపశమనం 

జీఎస్టీ 2.0 మధ్యతరగతికి ప్రయోజనం  

జీఎస్టీ 2.0 మార్పులతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం 12%లో ఉన్న చాలా వస్తువులు 5%కు వస్తాయి. 28%లో ఉన్న దాదాపు 90% వస్తువులు 18% రేటులోకి మారతాయి. ఆహార పదార్థాలు, మందులు, వైద్య పరికరాలు, స్టేషనరీ, విద్యా సామాగ్రి, పర్సనల్ కేర్ వస్తువులు ఎప్పటిలాగే పన్ను మినహాయింపు లేదా 5% రేటు కింద కొనసాగుతాయి. అయితే గృహోపకరణాల్లో వినియోగించే ఎసి, ఫ్రిజ్, టీవీలు వంటి వస్తువులకు 18% పన్ను విధించనున్నారు.