Loading...
Stockal Trading Scam: స్టాక్‌ఎల్‌ ట్రేడింగ్‌ మోసం.. భారతీయ ఇన్వెస్టర్లకు రూ.100 కోట్ల నష్టం?
స్టాక్‌ఎల్‌ ట్రేడింగ్‌ మోసం.. భారతీయ ఇన్వెస్టర్లకు రూ.100 కోట్ల నష్టం?

Stockal Trading Scam: స్టాక్‌ఎల్‌ ట్రేడింగ్‌ మోసం.. భారతీయ ఇన్వెస్టర్లకు రూ.100 కోట్ల నష్టం?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన భారతీయులకు భారీ నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ స్టాక్‌ఎల్‌ (Stockal) ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించి, ఇన్వెస్టర్ల అమెరికా షేర్లను విక్రయించినట్లు దాదాపు 30 మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో బాధితులు సుమారు రూ.100 కోట్ల మేర నష్టపోయినట్లు సమాచారం. కొందరు తమకు 4.26 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అమెరికా షేర్లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు స్టాక్‌ఎల్‌ వేదికగా పనిచేస్తోంది.

వివరాలు 

ఆపిల్‌, టెస్లా, అమెజాన్‌ షేర్లు విక్రయం

ఈ ఘటనలో బాధితుడైన ఓ ప్రముఖ భారతీయ పానీయాల సంస్థలో ఉన్నతాధికారి మాట్లాడుతూ.. తనకు చెందిన 10 కీలక అమెరికా షేర్లను అనుమతి లేకుండా విక్రయించినట్లు తెలిపారు.

ఆపిల్‌, టెస్లా, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌, ఎన్విడియా, ఏఎండీ వంటి సంస్థల షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంతో చైనాకు చెందిన జిబావో టెక్నాలజీ ఇంక్‌ (ZBAO) షేర్లను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఆ తర్వాతి కొన్ని రోజుల్లో ఈ షేరు విలువ దాదాపు 60 శాతం పడిపోయింది.

వివరాలు 

సెబీకి ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బాధిత ఇన్వెస్టర్లలో ఒకరు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు (సెబీ)కి ఫిర్యాదు చేశారు.

అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను కూడా ఆశ్రయించారు.

మరో ఇన్వెస్టర్‌ తన ఖాతాలోని 31 లక్షల డాలర్ల (సుమారు రూ.29 కోట్లు) విలువైన షేర్లను అక్టోబర్‌ 15న అనుమతి లేకుండా విక్రయించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇందులో డ్రైవ్‌వెల్త్‌ ఎల్‌ఎల్‌సీ, స్టాక్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, బోర్డర్‌లెస్‌ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బోర్డర్‌లెస్‌ ఇన్వెస్టింగ్‌ ఇంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థల పేర్లను పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బాధితుడికి డ్రైవ్‌వెల్త్‌ లేఖ

బాధిత ఇన్వెస్టర్‌లో ఒకరికి డ్రైవ్‌వెల్త్‌ పంపిన లేఖలో.. స్టాక్‌ఎల్‌ ప్లాట్‌ఫామ్‌తో తమ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ఖాతాలోకి అనధికారిక ప్రవేశం జరిగినట్లు పేర్కొంది.

ఆ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన భద్రతా లోపాలకు స్టాక్‌ఎల్‌ బాధ్యత వహించాలని తెలిపింది.

ఈ అనధికారిక కార్యకలాపాలు తమ సంస్థ వద్ద ప్రారంభం కాలేదని, స్టాక్‌ఎల్‌ ఖాతాల భద్రతలో లోపాలకు తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్టాక్‌ఎల్

ఈ వ్యవహారంపై స్పందించిన స్టాక్‌ఎల్‌.. జరిగిన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విధానంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

ఇప్పటివరకు జరిపిన పరిశీలనలో బోర్డర్‌లెస్‌/స్టాక్‌ఎల్‌ ప్లాట్‌ఫామ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని మనీకంట్రోల్‌కు పంపిన అధికారిక ఈమెయిల్‌లో పేర్కొంది.

ఈ ఘటన ఎలా జరిగింది? ఖాతాల్లోకి అనధికారికంగా ఎలా ప్రవేశించారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT