LOADING...
Gold Karat: బంగారం క్యారెట్లు ఎంత? స్వచ్ఛతను ఎలా కొలుస్తారంటే?
బంగారం క్యారెట్లు ఎంత? స్వచ్ఛతను ఎలా కొలుస్తారంటే?

Gold Karat: బంగారం క్యారెట్లు ఎంత? స్వచ్ఛతను ఎలా కొలుస్తారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకం. ధర పెరిగినా, తగ్గినా అది చర్చనీయాంశమే. ప్రస్తుతం బంగారం ధర తులానికి రూ.1.16 లక్షల వద్ద ఉండగా, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. హాల్‌మార్క్ గుర్తింపు బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్‌మార్క్ జారీ చేస్తుంది. 24 క్యారెట్ ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాశారు. ఎక్కువగా 22 క్యారెట్ బంగారమే విక్రయిస్తుండగా, 18 క్యారెట్ బంగారానికి కూడా డిమాండ్ ఉంది.

Details

బంగారం రకాల వివరాలు 

24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛత కలిగినది. స్వచ్ఛమైన బంగారం రూపం ఇదే. 24 క్యారెట్ బంగారం ఆభరణాల తయారీకి తగదు. ఇది పెట్టుబడి ప్రయోజనాలకు అనువైనది. 22 క్యారెట్ బంగారం 22 భాగాల బంగారంలో రాగి, జింక్ వంటి ఇతర లోహాల 2 భాగాలు కలుపుతారు. ఇది ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. దీనిని '916 బంగారం' అని కూడా పిలుస్తారు. 18 క్యారెట్ బంగారం 18 భాగాల బంగారం, 6 ఇతర లోహాలు కలిపి ఉంటుంది. 75% స్వచ్ఛత కలిగి, మిగతా 25% రాగి, జింక్, నికెల్ వంటి లోహాలు ఉంటాయి. ఇది బలంగా, మన్నికగా ఉంటుంది.

Details

14 క్యారెట్ బంగారం

58.3% బంగారం, 41.7% ఇతర లోహాలు కలిగి ఉంటుంది. ధర తక్కువగా ఉండి, రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. క్యారెట్ ద్వారా స్వచ్ఛత కొలత క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛత కొలమానం. ఇది 0 నుండి 24 స్కేల్‌లో లెక్కించబడుతుంది. ఉదాహరణకు, 14 క్యారెట్ బంగారు ఉంగరంలో 14/24 అంటే 58.3% బంగారం ఉంటుంది. క్యారెట్ విలువ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. రాగి, నికెల్, వెండి, పల్లాడియం వంటి లోహాలు కలిపి బంగారాన్ని బలోపేతం చేస్తారు.

Details

ధరల అప్‌డేట్‌లు 

బంగారం తాజా ధరలు తెలుసుకోవాలంటే 8955664433కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. వెంటనే SMS ద్వారా రేట్లు అందుతాయి. అదనంగా [www.ibja.co](http://www.ibja.co) లేదా [ibjarates.com](http://ibjarates.com) ద్వారా కూడా ధరలు తెలుసుకోవచ్చు. గమనించాల్సిందేమిటంటే, ఇందులో జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం స్థానిక జువెలర్స్‌ను సంప్రదించాలి. హాల్‌మార్క్ ప్రాముఖ్యత బంగారం కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్ గుర్తు తప్పనిసరిగా చూడాలి. ఇది బంగారం నాణ్యతకు ప్రభుత్వ హామీ. హాల్‌మార్కింగ్ పద్ధతిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నియంత్రిస్తుంది. BIS యాక్ట్, నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది.