How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!
ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం స్టాక్ బ్రోకర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) ని రెండు ప్రధాన డిపాజిటరీల లేదా క్రియేట్ చేస్తారు. డీపీఅకౌంట్ 16-అంకెల నంబర్‌తో వస్తుంది. ఇది కాషన్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది. ఒకసారి డీమ్యాట్ అకౌంట్ ఉన్న తర్వాత, ఐపీవోకు అప్లై చేయడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా స్టాక్ మార్కెట్ యాప్స్ ద్వారా అనుసరించడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంకింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత 'ఇన్వెస్ట్ & ఇన్సురెన్స్' ఆప్షన్ పై క్లిక్ చేసి 'ఇన్వెస్ట్ ఆన్‌లైన్' పై క్లిక్ చేయాలి.
ఆన్ లైన్ ద్వారా పేమెంట్
ఆపై కొన్ని సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్, షేర్ హోల్డర్, ఎంప్లాయ్ కేటగిరీ వంటి ఎంపికలను చూడొచ్చు. జీరోధా వంటి యాప్‌లలో కూడా కస్టమర్‌లు కంసోల్‌లోకి వెళ్లి ఐపీవో ఆప్షన్‌పై క్లిక్ చేసి యూపీఐ లేదా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్‌ను సులభంగా చేయవచ్చు. గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా నోటిఫికేషన్ వస్తుంది, దానిని ఆటోపే ద్వారా ధ్రువీకరించవచ్చు. ఇది పూర్తియైన తర్వాత సాధారణంగా రిటైల్ కేటగిరీ కోసం 2 లక్షల లోపు ఐపీవోలకు అప్లై చేయాలి. అధిక ధరకు షేర్లను ఎంచుకుంటే అలోట్మెంట్ పొందే అవకాశం ఎక్కువ. ధ్రువీకరణ చేసిన తర్వాత, అప్లికేషన్ నంబర్ వస్తుంది, దాని ద్వారా మీ దరఖాస్తు ధ్రువీకరించవచ్చు.