Page Loader
Google: గూగుల్‌కు భారీ ఫైన్‌.. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తొక్కేసినట్లు ఆరోపణలు

Google: గూగుల్‌కు భారీ ఫైన్‌.. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తొక్కేసినట్లు ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తన స్వార్థం కోసం తొక్కేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2006లో యూకేకు చెందిన షివన్, ఆడమ్ రిఫ్ అనే జంట 'ఫౌండెమ్' అనే ధరలను పోల్చే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ను లైవ్‌లోకి తెచ్చిన తర్వాత, గూగుల్ సెర్చ్‌లో దాని విజిబులిటీ గణనీయంగా తగ్గడం మొదలైంది. ప్రజలు 'ప్రైస్ కంపారిజన్', 'షాపింగ్' వంటి కీవర్డ్స్ వాడినా ఈ వెబ్‌సైట్ కనబడడం లేదు.

వివరాలు 

పడిపోయిన గూగుల్‌ ర్యాంక్‌  

గూగుల్‌లో అమలులో ఉన్న ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ కారణంగా తమ వెబ్‌సైట్ దెబ్బతింటున్నదని షివన్ , ఆడమ్ గుర్తించారు. గూగుల్‌లో వారి ర్యాంక్ కూడా డ్రమాటిక్‌గా పడిపోయింది, అయితే ఇతర సెర్చ్ ఇంజిన్లలో సాధారణ స్థాయిలో ఉంది. దీనివల్ల 'ఫౌండెమ్' ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. సాంకేతిక కారణాల వల్ల తమ పేజీ సెర్చ్‌లో కనపడడంలేదని గుర్తించి.. గూగుల్‌ ఈవిషయాన్ని ప్రస్తావించారు. దాదాపు రెండేళ్లైనా అది పెనాల్టీని తొలగించలేదు. అయితే, దాదాపు రెండేళ్లుగా ఈ పెనాల్టీని తొలగించలేదు.

వివరాలు 

2017లో మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం

ఈ నేపథ్యంలో, ఆ జంట ఐరోపా కమిషన్‌ను ఆశ్రయించింది.అధికారులు సుదీర్ఘ కాలం దర్యాప్తు చేసి, గూగుల్ తన షాపింగ్ సర్వీస్‌ను ప్రమోట్ చేసుకోవడానికి 'ఫౌండెమ్' వంటి సంస్థలతో అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. 2017లో మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని తీర్పును వెలువరించారు.గూగుల్‌పై 2.4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 26 వేల కోట్లు) జరిమానా విధించారు. దీనిపై గూగుల్ అప్పీల్‌కు వెళ్లింది,కానీ దాదాపు ఏడేళ్ల న్యాయపోరాటం తరువాత 'ది యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్' ఆ తీర్పును సమర్థించింది. గూగుల్ అప్పీల్‌ను తిరస్కరించింది. ఈ తీర్పు ఆలస్యమైందని షివన్ , ఆడమ్ అభిప్రాయపడ్డారు. వీరి 'ఫౌండెమ్'ను 2016లో మూసివేయాల్సి వచ్చింది, అయితే సివిల్ డామేజ్ క్లెయిమ్‌లపై కేసు 2026లో విచారణకు రానున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

 800 షాపింగ్ కంపారిజన్ సర్వీసులకు కోట్ల కొద్దీ క్లిక్‌లు 

గూగుల్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ఐరోపా కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా 2017లో చేసిన మార్పులను కొనసాగిస్తున్నామని చెప్పారు. దాదాపు 800 షాపింగ్ కంపారిజన్ సర్వీసులకు కోట్ల కొద్దీ క్లిక్‌లు వచ్చాయని తెలిపారు.