Stock market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది.
ప్రపంచ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నేపథ్యంలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమై 76,791.09 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50 కూడా 23,250 స్థాయికి పడిపోయింది.
సెన్సెక్స్ 77,063.94 వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, మునుపటి ముగింపు స్థాయి 77,505.96తో పోల్చితే భారీగా నష్టపోయింది.
నిఫ్టీ 50 కూడా 23,319.35 వద్ద ప్రారంభమై, ఒక శాతం మేర తగ్గి 23,246.55 స్థాయికి చేరుకుంది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మరింత నష్టాలు నమోదయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం మేర పడిపోయాయి.
Details
రూ. 5 లక్షల కోట్లు ఆవిరి
ఉదయం 11.15 గంటల సమయంలో సెన్సెక్స్ 418 పాయింట్లు (0.54 శాతం) కోల్పోయి 77,100 స్థాయికి దిగజారింది. నిఫ్టీ 50, 160 పాయింట్లు (0.64 శాతం) నష్టపోయి 23,337 వద్ద ట్రేడైంది.
BSEలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 424 లక్షల కోట్ల నుంచిరూ. 419 లక్షల కోట్లకు పడిపోయింది. దాదాపుగా ఒక్కరోజులోనే రూ. 5 లక్షల కోట్లు నష్టపోయారు.
స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
1. అంతర్జాతీయ మార్కెట్ల అస్థిరత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాపై కొత్త టారిఫ్‌లను విధించడంతో ప్రపంచ మార్కెట్లలో భారీ మాంద్యం వచ్చింది.
జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా KOSPI సూచీలు 3 శాతం మేర నష్టపోయాయి.
Details
2. ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం కెనడా, మెక్సికోపై 25% టారిఫ్‌లు, చైనా నుంచి దిగుమతులపై 10% సుంకం విధించింది. దీని వల్ల వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
మిగతా దేశాలపై కూడా ఇలాంటి ఆంక్షలు వస్తాయనే భయం మార్కెట్లలో నెలకొంది.
3. డాలర్ ఇండెక్స్ పెరుగుదల - రూపాయి నష్టపోవడం
భారతీయ రూపాయి ఒక అమెరికా డాలర్‌కు 87 స్థాయికి చేరుకుని రికార్డు కనిష్ఠాన్ని తాకింది.
ట్రంప్ విధించిన ఆంక్షల కారణంగా డాలర్ ఇండెక్స్ 109.6కి చేరుకుంది. దీని ప్రభావంతో విదేశీ పెట్టుబడిదారులు (FIIs) మరింతగా భారత స్టాక్ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్నారు.
Details
4. ఆర్ బి ఐ వడ్డీ రేట్లపై అనిశ్చితి
బడ్జెట్ అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై అందరి దృష్టి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను తగ్గింపు ప్రకటన చేసినా, ఆర్ బి ఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? లేదా? అనే అనిశ్చితి మార్కెట్ పై ప్రభావం చూపుతోంది.
5. విదేశీ పెట్టుబడిదారుల క్యాపిటల్ అవుట్‌ఫ్లో
అక్టోబర్ 2024 నుంచి FIIs భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఫిబ్రవరి 1, 2025 నాటికి రూ. 2.7 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.