LOADING...
Elon Musk: ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!
ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!

Elon Musk: ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు న్యాయస్థానంలో కీలక విజయం దక్కింది. 2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్‌ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్‌ సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. టెస్లాను గణనీయమైన వృద్ధి దిశగా తీసుకెళ్లినందుకు ప్రోత్సాహకంగా ఈ వేతన ప్యాకేజీని అప్పట్లో కంపెనీ ప్రకటించింది. అయితే మస్క్‌కు ఇంత భారీ మొత్తంలో వేతనం చెల్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టెస్లా కంపెనీకి చెందిన ఒక వాటాదారు కోర్టును ఆశ్రయించారు. మస్క్‌కు అనుకూలంగా ఉన్న బోర్డే ఈ వేతన ప్యాకేజీని రూపొందించిందని, అలాగే అనుమతుల ప్రక్రియలో నిబంధనలు సరిగా పాటించలేదని ఆరోపించారు.

Details

వేతన ప్యాకేజీకి చట్టబద్ధత

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కింది కోర్టు, 2024లో మస్క్‌కు ప్రకటించిన వేతన ప్యాకేజీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పులో పలు లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, 2018లో ప్రకటించిన వేతన ప్యాకేజీని పునరుద్ధరించాలని కోరుతూ అప్పీల్ దాఖలైంది. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన డెలావేర్‌ సుప్రీంకోర్టు, కింది కోర్టు తీర్పులో లోపాలున్నాయని స్పష్టం చేస్తూ, మస్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో 2018 నాటి 55 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీకి మళ్లీ చట్టబద్ధత లభించినట్లైంది. ఈ తీర్పు ఎలాన్‌ మస్క్‌కు కాకుండా టెస్లా సంస్థకు కూడా కీలకంగా మారింది.

Advertisement