Loading...
Air India: ఎయిర్ ఇండియాలో భారీ స్కాం.. 4 వేల మంది ఉద్యోగులపై చర్యలకు టాటా సిద్ధం!
ఎయిర్ ఇండియాలో భారీ స్కాం.. 4 వేల మంది ఉద్యోగులపై చర్యలకు టాటా సిద్ధం!

Air India: ఎయిర్ ఇండియాలో భారీ స్కాం.. 4 వేల మంది ఉద్యోగులపై చర్యలకు టాటా సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం అంతర్గత సంక్షోభంలో చిక్కింది. సంస్థ 'ఉచిత ప్రయాణ సౌకర్యం' (Employee Leisure Travel - ELT) వేలాది ఉద్యోగుల చేత దుర్వినియోగం అయ్యినట్లు అంతర్గత దర్యాప్తులో తేలిన‌ట్లు స‌మాచారం. ఆక్రమంలో సుమారు 4,000 మందికి పైగా సిబ్బంది భాగస్వాములుగా ఉన్నారని యాజమాన్యం గుర్తించింది. ఇప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

Details

కుంభకోణం వివరాలు

ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి.

ఈ టిక్కెట్లను ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్య, పిల్లలు) మాత్రమే ఉపయోగించాలి.

అయితే దర్యాప్తులో తెలిసిన నిజాలు షాక్ ఇచ్చాయి. చాలా మంది ఉద్యోగులు తమకు సంబంధం లేని వ్యక్తులను 'బంధువుల'గా చూపి ఉచిత టిక్కెట్లు పొందారు.

మరికొందరు టిక్కెట్లను మార్కెట్‌లో భారీ ధరలకు అమ్మి లాభం పొందినట్లు స‌మాచారం.

details

కొత్తగా చేరిన ఉద్యోగులు ఎక్కువగా

24,000 మంది సిబ్బందిలో సుమారు 16% (4,000 మంది) ఈ అక్రమాలకు పాల్పడ్డారు.

గమనార్హమైన విషయం ఏమిటంటే వీరిలో మెజారిటీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత, టాటా గ్రూప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత చేరిన ఉద్యోగులే.

టాటా యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి రికవరీ చర్యలు ప్రారంభించింది.

మోసపూరితంగా ఉపయోగించిన టిక్కెట్ల విలువను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తున్నారు.

అదనంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించనున్నారు.

ADVERTISEMENT

Details

రక్త సంబంధాన్ని నిరూపించే పత్రాలు సమర్పించడం తప్పనిసరి

వారి ప్రయాణ సౌకర్యాలను రద్దు చేస్తారు.

ఇకపై నామినీలను చేర్చడానికి చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధాన్ని నిరూపించే పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అక్రమాలు సంస్థ ఆర్థిక నష్టానికి మాత్రమే కాకుండా, ఉద్యోగుల నైతికతను కూడా ప్రభావితం చేస్తున్నాయి.

టాటా గ్రూప్ సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందనే సమయంలో ఈ పరిస్థితి ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT