Loading...
IBM: 58 ఏళ్లలో తొలిసారి ఐబీఎం షేర్లకు భారీ పతనం.. రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి
58 ఏళ్లలో తొలిసారి ఐబీఎం షేర్లకు భారీ పతనం.. రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి

IBM: 58 ఏళ్లలో తొలిసారి ఐబీఎం షేర్లకు భారీ పతనం.. రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌) షేర్లు ఒక్కరోజులోనే భారీగా కుప్పకూలాయి. మంగళవారం(అమెరికా కాలమానం ప్రకారం)జరిగిన వాల్‌స్ట్రీట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర 25.21 శాతం పడిపోయి 217.07 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనంతో కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీ మార్కెట్‌ విలువ నుంచి దాదాపు 70 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6.7 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఐబీఎం షేరు ఈ స్థాయిలో పడిపోవడం 1968 జనవరి 3 తర్వాత ఇదే తొలిసారి. అంటే దాదాపు 58 ఏళ్లలో కంపెనీ షేర్లకు నమోదైన అతిపెద్ద ఒక్కరోజు పతనంగా ఇది నిలిచింది.

వివరాలు 

అంచనాలకు తగ్గ ఆదాయ వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసిక ప్రాథమిక ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించిన వెంటనే మదుపర్లు భారీగా షేర్లను విక్రయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన పూర్తి ఆర్థిక ఫలితాలను ఐబీఎం వచ్చే వారం విడుదల చేయనుంది.

అయితే అందుకు ముందే ప్రకటించిన ప్రాథమిక వివరాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి.

కంపెనీ ఆదాయం ఈసారి అంచనాలకు తగ్గట్టుగా లేకుండా కేవలం 1 శాతం మాత్రమే పెరిగి 17.2 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది.

విభాగాల వారీగా చూస్తే,సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం 5 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని పేర్కొంది.

మరోవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగం 7 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. ఈ గణాంకాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీశాయి.

వివరాలు 

ఏఐ పెట్టుబడుల మార్పుతో తగ్గిన డిమాండ్

ఈ పరిణామాల నేపథ్యంలో మదుపర్లకు రాసిన లేఖలో ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టంగా స్పందించారు.

ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ)పై దృష్టి పెట్టిన సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.

భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో కంపెనీలు ఇటీవల సర్వర్లు, స్టోరేజ్‌ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ పరికరాలు, మెమొరీ చిప్‌ల కొనుగోళ్లపై ఎక్కువ దృష్టి పెట్టాయని చెప్పారు.

దీంతో ఐబీఎం ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ పెట్టుబడుల మార్పుతో తగ్గిన డిమాండ్

అంతేకాదు, ఈ మారుతున్న పరిస్థితులను సకాలంలో అంచనా వేయడంలో సంస్థ విఫలమైందని ఆయన అంగీకరించారు.

మారుతున్న మార్కెట్‌ ధోరణులకు వేగంగా స్పందించలేకపోయామని, కస్టమర్ల వ్యయ ప్రాధాన్యతలు ఎంత వేగంగా మారుతాయో సరైన సమయంలో గుర్తించలేకపోయామని పేర్కొన్నారు.

అలాగే, ఏఐపై పెట్టుబడులతో పాటు ప్రస్తుతం అనేక కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీపై కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుండటం తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపిందని అరవింద్‌ కృష్ణ వెల్లడించారు.

ADVERTISEMENT