Loading...
Bank strike: మరోసారి ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. డిసెంబర్ 3న దేశవ్యాప్త బంద్!
మరోసారి ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. డిసెంబర్ 3న దేశవ్యాప్త బంద్!

Bank strike: మరోసారి ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. డిసెంబర్ 3న దేశవ్యాప్త బంద్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యాయి. కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమ్ వాత్సా నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం మెజారిటీ వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2026 డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIIDBIOA), ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఉమ్మడి వేదిక అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ (UFIOE) ఈ మేరకు సమ్మె నోటీసు జారీ చేసింది.

వివరాలు 

డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

ఐడీబీఐ బ్యాంక్ దేశానికి చెందిన జాతీయ సంపద అని, దాని విక్రయ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు కూడా లేఖ రాశాయి.

గత నెలలోనే ఐడీబీఐ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించాయి.

అయినప్పటికీ ప్రైవేటీకరణ ప్రక్రియలో వెనక్కి తగ్గకపోవడంతో మరోసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి.

యునైటెడ్ ఫోరమ్ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్ శాఖలు, కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు.

ఈ సమ్మెలో బ్యాంకులో పనిచేస్తున్న 19 వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు పాల్గొననున్నట్లు సంఘాలు వెల్లడించాయి.

వివరాలు 

ఒకరోజు సమ్మెతో ఉద్యమాన్ని అపబొం 

కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

డిసెంబర్ 3న జరిగే ఒకరోజు సమ్మెతో ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశాయి.

అవసరమైతే బహుళ రోజుల సమ్మెలకు దిగుతామని,చివరకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే నిరవధిక సమ్మె చేపట్టే అవకాశముందని హెచ్చరించాయి.

ఫెయిర్‌ఫాక్స్‌తో కుదరనున్న కొనుగోలు ఒప్పందానికి నియంత్రణపరమైన అనుమతులు ఇవ్వవద్దని ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరాయి.

ఇప్పటికే ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు సీఎస్‌బీ బ్యాంకులో 40శాతం వాటా ఉందని యూనియన్లు గుర్తుచేశాయి.

ఐడీబీఐ బ్యాంక్ నియంత్రణ విదేశీసంస్థ చేతుల్లోకి వెళ్లడం వల్ల ఎదురయ్యే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

అంతేకాకుండా ఐడీబీఐ బ్యాంకు నిధుల వినియోగంపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఐడీబీఐ-ఫెయిర్‌ఫాక్స్ మధ్య రూ.52,878 కోట్ల ఒప్పందం

ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల విక్రయానికి సంబంధించి 2026 అక్టోబర్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మాతృ సంస్థకు సుమారు రూ.52,878 కోట్ల విలువైన 60.72 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తనకున్న 30.48 శాతం వాటాను సుమారు రూ.26,620 కోట్లకు విక్రయించనుంది.

అలాగే ఎల్ఐసీ తన వద్ద ఉన్న 30.24 శాతం వాటాను సుమారు రూ.26,440 కోట్లకు విక్రయించనుంది.

ఈ రెండు వాటాల విక్రయం పూర్తయితే ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 15 శాతానికి, ఎల్ఐసీ వాటా 19 శాతానికి తగ్గనున్నాయి.

దీంతో బ్యాంకు యాజమాన్య నియంత్రణ ఫెయిర్‌ఫాక్స్ చేతుల్లోకి వెళ్లనుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఐడీబీఐ-ఫెయిర్‌ఫాక్స్ మధ్య రూ.52,878 కోట్ల ఒప్పందం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆర్‌బీఐ నుంచి అవసరమైన అనుమతులు పొందుతూ ఈ లావాదేవీని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించడంతో ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT