LOADING...
Credit Card: క్రెడిట్ కార్డు వాడకంలో ఈ చిన్న తప్పులు చేస్తే వెంటనే బ్లాక్ అయ్యే ప్రమాదం!
క్రెడిట్ కార్డు వాడకంలో ఈ చిన్న తప్పులు చేస్తే వెంటనే బ్లాక్ అయ్యే ప్రమాదం!

Credit Card: క్రెడిట్ కార్డు వాడకంలో ఈ చిన్న తప్పులు చేస్తే వెంటనే బ్లాక్ అయ్యే ప్రమాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం సాధారణంగా మారిపోయింది. చాలా మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్డులు ఉండటం కనిపిస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా కొంతమంది కార్డులు తీసుకుంటున్నారు. మరికొందరు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని భావించి తీసుకుంటున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా వాడితే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కార్డు బ్లాక్ కూడా అవుతుంది.

వివరాలు

నిషేధిత లావాదేవీలకు దూరంగా ఉండాలి

క్రెడిట్ కార్డుల వినియోగంపై Reserve Bank of India కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని ప్రధానంగా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ లాంటి పెట్టుబడుల కోసం కార్డును వాడటం నిషేధం. అలాగే బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వంటి లావాదేవీలకు కూడా కార్డు ఉపయోగించకూడదు. ఈ రూల్స్‌ను ఉల్లంఘిస్తే బ్యాంకులు కార్డును వెంటనే బ్లాక్ చేస్తాయి.

వివరాలు

ఒక్కసారిగా భారీ లావాదేవీలు చేయొద్దు

ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఖర్చు చేసే వారు ఒక్కసారిగా లక్షల్లో ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంకులు దాన్ని అనుమానాస్పదంగా పరిగణిస్తాయి. ఉదాహరణకు సాధారణంగా రూ.20 వేల వరకు ఖర్చు చేసే వ్యక్తి ఒక్కసారిగా రూ.2 లక్షలు వాడితే, ఫ్రాడ్ అనుమానం వ్యక్తం చేసి కార్డు బ్లాక్ చేసే అవకాశం ఉంది. అలాగే గుర్తు తెలియని వెబ్‌సైట్లలో ట్రాన్సాక్షన్స్ చేస్తే కూడా ప్రమాదం ఉంటుంది.

Advertisement

వివరాలు

బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

మూడు నెలల పాటు కనీస బకాయిని కూడా చెల్లించకపోతే, మిమ్మల్ని డిఫాల్టర్‌గా గుర్తిస్తారు. అప్పుడు కార్డును బ్లాక్ చేసి ట్రాన్సాక్షన్లను నిలిపివేస్తారు. అంతేకాదు ఈ సమాచారం సిబిల్‌కు చేరడంతో మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా పడిపోతుంది. దాంతో భవిష్యత్తులో రుణాలు లేదా కొత్త కార్డులు పొందడం కష్టమవుతుంది.

Advertisement

వివరాలు

వ్యాపార అవసరాలకు ఉపయోగించవద్దు

పర్సనల్ క్రెడిట్ కార్డులను వ్యాపార అవసరాలకు ఎక్కువగా వాడినా సమస్యలు వస్తాయి. ఉదాహరణకు షాపింగ్ కోసం కాకుండా వ్యాపార లావాదేవీలకు వాడితే బ్యాంకులు అనుమానిస్తాయి. మొత్తంగా చూస్తే, క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా, నిబంధనలకు అనుగుణంగా ఉపయోగిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే కార్డు బ్లాక్ కావడం నుంచి క్రెడిట్ స్కోర్ దెబ్బతినే వరకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement