NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది: సీనియర్ IMF అధికారి 
    తదుపరి వార్తా కథనం
    Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది: సీనియర్ IMF అధికారి 
    భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది:

    Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది: సీనియర్ IMF అధికారి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 28, 2024
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి ష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    గత 10 ఏళ్లలో దేశం అమలు చేసిన మంచి విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేయగలిగితే, 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని సుబ్రమణియన్ ఈ రోజు అన్నారు.

    సుబ్రమణియన్ మాట్లాడుతూ 8 శాతం వృద్ధి రేటు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనదని, ఎందుకంటే భారత్ ఇంతకుముందు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందలేదు, కానీ సాధించగలిగిందని చెప్పారు.

    Details 

    2023 చివరి మూడు నెలల్లో 8.4శాతం వృద్ధి

    కాబట్టి,మా ఆలోచన ఏమిటంటే,గత 10 సంవత్సరాలలో భారతదేశం నమోదు చేసుకున్న వృద్ధి రకంతో, మేము గత 10 సంవత్సరాలుగా అమలు చేసిన మంచి విధానాలను రెట్టింపు చేయగలిగితే,సంస్కరణలను వేగవంతం చేయగలిగితే,అప్పుడు భారతదేశం 2047 వరకు 8 శాతం వద్ద వృద్ధి చెందుతుంది, "అని టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన అన్నారు.

    2023 చివరి మూడు నెలల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే మెరుగైన 8.4శాతం వృద్ధిని సాధించింది.

    గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యంత వేగాన్ని నమోదు చేసింది. అక్టోబరు-డిసెంబర్‌లో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 7.6 శాతానికి తీసుకువెళ్లింది.

    1991 నుండి, భారతదేశ సగటు వృద్ధి 7శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆయన హైలెట్ చేశారు.

    Details 

    బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అవసరం 

    దేశం జిడిపిలో 58 శాతం దేశీయ వినియోగం నుండి వస్తున్నందున భారతదేశం తన దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సుబ్రమణియన్ ఉద్ఘాటించారు.

    అందుకే, తగినంత ఉద్యోగాలను సృష్టించగలిగితే అది చాలా ఎక్కువ వినియోగానికి దారి తీస్తుందని అన్నారు.

    భారత IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

    భూమి, కార్మిక, మూలధనం, లాజిస్టిక్స్ రంగంలో సంస్కరణలు అవసరమని కూడా ఆయన సూచించారు.

    తయారీ రంగంలో సంస్కరణలు అవసరం, కానీ అదే సమయంలో, తయారీ రంగానికి క్రెడిట్ అందించడానికి బ్యాంకింగ్ రంగంలో కూడా సంస్కరణలు అవసరమని సుబ్రమణియన్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎంఎఫ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఐఎంఎఫ్

    పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్ పాకిస్థాన్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ చైనా
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025