LOADING...
SBI- HDFC bank: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. టాప్ 10 ఇండియా కంపెనీలకు Rs.4.48 లక్షల కోట్లు నష్టం
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. టాప్ 10 ఇండియా కంపెనీలకు Rs.4.48 లక్షల కోట్లు నష్టం

SBI- HDFC bank: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. టాప్ 10 ఇండియా కంపెనీలకు Rs.4.48 లక్షల కోట్లు నష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారతీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత వారం దేశీయ మార్కెట్‌ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మార్కెట్‌లోని టాప్‌-10 కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.4.48 లక్షల కోట్లు మేర తగ్గిపోయింది. బీఎస్‌ఈలోని BSE సెన్సెక్స్ సూచీ 4,354.98 పాయింట్లు పడిపోయింది. అలాగే నిఫ్టి 50 సూచీ 5.31 శాతం నష్టపోయి 1,299.35 పాయింట్లు క్షీణించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి.

Details

అగ్ర కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి

ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్‌లోని అగ్ర కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్‌ విలువ రూ.89,306.22 కోట్లు తగ్గి రూ.9,66,261.05 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ.61,715.32 కోట్లు తగ్గి రూ.12,57,391.76 కోట్లకు చేరింది.

Details

మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలోనే అగ్రస్థానం

ఇక బ‌జాజ్ ఫైనాల్స్ రూ.59,082.49 కోట్లు, టీసీఎస్ రూ.53,312.52 కోట్లు నష్టపోయాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు రూ.42,205.04 కోట్లు, భార‌తీ ఎయిర్ టెల్ రూ.38,688.78 కోట్లు మేర మార్కెట్‌ విలువ కోల్పోయాయి. అదేవిధంగా రిల‌యెన్స్‌ కూడా రూ.33,289.88 కోట్లు నష్టపోయి, దాని మార్కెట్‌ విలువ రూ.18,68,293.17 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement