Stock Market: యూఎస్-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించడంతో పాటు, ఇరాన్‌తో చర్చలు జరపనున్నట్లు అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ సూచీలు కూడా పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 గంటల సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగబాకి 78,613 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 24,557 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13గా నమోదైంది. ఈ షేర్లు లాభాల్లో.. నిఫ్టీ సూచీలో ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ** షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
చమురు ధరలు 5% తగ్గుదల
మరోవైపు సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, సిప్లా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 5 శాతం తగ్గి 83.5 డాలర్లకు చేరుకుంది.
చమురు ధరల ఈ తగ్గుదల కూడా దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చిన ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.