Wholesale inflation: తయారీ రంగంపై ప్రభావం.. టోకు ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 2.38%కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నారు.
ఇది జనవరిలో 2.31శాతం నుండి స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. ఇది రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తల అంచనా 2.36శాతం కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.
ఆహారం, తయారీ రంగం, వస్త్రాలు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే టోకు ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 7.47% నుండి ఫిబ్రవరిలో 5.94%కి తగ్గింది.
అదేవిధంగా ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.69% నుండి 2.81%కి తగ్గింది.
Details
తయారీ వస్తువుల ధరల పెరుగుదల
మరోవైపు, తయారీ వస్తువుల ధరలు గత నెలలో 2.51% నుండి 2.86శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ధరలు 0.71% స్వల్ప సంకోచాన్ని నమోదు చేశాయి.
దీనికి విరుద్ధంగా భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఏడు నెలల కనిష్ట స్థాయి 3.61శాతానికి పడిపోయింది. ఇది జనవరిలో 4.31శాతంగా ఉంది.
ఈ తగ్గుదలకు ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా ఉంది. ఇది 5.97% నుండి 3.75%కి తగ్గింది.
ఆహార ధరల స్థిరత్వం మెరుగుపడటం వల్లే ఈ తగ్గుదలకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పేర్కొంది. ఇంకా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత మితంగా ఉంటుందని అంచనా వేస్తోంది.