FY24లో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనా 6.7శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2023-24లో 6.7% వృద్ధి రేటును సాధిస్తుందని 11 మంది ఆర్థికవేత్తల బృందం అంచనా వేసింది. దేశీయ డిమాండ్, పెరిగిన పెట్టుబడులు ఈ వృద్ధి రేటుకు కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారత ఆర్థిక వృద్ధి రేటను 7శాతం అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్‌బీఐ కంటే ఆర్థికవేత్తల బృందం వృద్ధి రేటును తక్కువగా అంచనా వేయడం గమనార్హం. బార్‌క్లేస్‌లోని ఈఎం ఆసియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ రాహుల్ బజోరియా మాట్లాడుతూ.. భారత్ వెలుపల ప్రతి కూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ అంచనా వేసిన దాన్ని కంటే.. 11 మంది ఆర్థికవేత్తల బృందం తక్కువ అంచనా వేసింది.
సానుకూలంగా భారత వృద్ధి రేటు
ఉత్పాదక రంగం జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక గరిష్ట వృద్ధిని 13.9శాతం సాధించింది. అయితే పెట్టుబడులు గత సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగాయి. ఇక FY25 ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నిపుణులు అంచనా వేశారు. వచ్చే ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటును 6.3శాతంగా చెప్పుకొచ్చారు. ఫిలిప్‌క్యాపిటల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అంజలి వర్మ మాట్లాడుతూ.. గత 1.5 సంవత్సరాలుగా భారత వృద్ధి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో వృద్ధిరేటు మరింత ఊపందుకుంటుందన్నారు. 2025లో ద్రవ్యోల్బణం కూడా మెరుగుపడుతుందని అంచనా నిపుణులు అంచనా వేశారు.