ITR Filing Update: 4 కోట్ల మార్క్ దాటిన ఐటీఆర్ ఫైలింగ్..చివరి నిమిషం వరకు ఆగొద్దన్న ఐటీ శాఖ..గడువు తేదీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల (ఐటీఆర్) దాఖలులో పన్ను చెల్లింపుదారులు వేగం పెంచుతున్నారు. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత ఐదు రోజులుగా రోజుకు సగటున 25లక్షల వరకు రిటర్నులు నమోదవుతున్నాయని తెలిపింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో సర్వర్లపై అధిక భారం పడకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా ఐటీఆర్-1,ఐటీఆర్-2 రిటర్నులను దాఖలు చేయాలని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పన్ను శాఖ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సాధారణ పన్ను చెల్లింపుదారులు,ఉద్యోగులకు జులై 31, 2026 వరకు గడువు ఉంది.
వివరాలు
గడువు ముగిసేలోపే రిటర్న్ ఫైల్ చెయ్యండి
ఈ తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే జరిమానాలు, వడ్డీ భారం పడే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశమున్నందున గడువు ముగిసేలోపే రిటర్న్ ఫైల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ముందుగానే ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి.
జులై చివరి రోజుల్లో లక్షలాది మంది ఒకేసారి ఐటీఆర్ పోర్టల్‌లో లాగిన్ కావడంతో సర్వర్ నెమ్మదించడం, ఓటీపీలు ఆలస్యంగా రావడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ముందుగానే రిటర్న్ సమర్పిస్తే ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చు.
వివరాలు
గడువు తేదీ దాటిన తర్వాత జరిమానా
అలాగే ముందుగా దాఖలైన రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ వేగంగా ప్రాసెస్ చేస్తుంది.
దీంతో పన్ను రీఫండ్ రావాల్సి ఉంటే తక్కువ సమయంలోనే నేరుగా బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, తొందరపాటులో తప్పులు చేసే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఫారం-16, ఏఐఎస్, 26ఏఎస్ వంటి పత్రాల్లోని వివరాలను ప్రశాంతంగా పరిశీలించి సరైన సమాచారంతో రిటర్న్ దాఖలు చేసే అవకాశం లభిస్తుంది.
గడువు తేదీ దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అందువల్ల చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే రిటర్న్ దాఖలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్ తప్పనిసరి
అయితే రిటర్న్ సమర్పించడంతో ప్రక్రియ పూర్తికాదని పన్ను శాఖ స్పష్టం చేసింది.
ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ద్వారా ఈ ప్రక్రియను కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
ఇ-వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లుబాటు కావని, అందువల్ల రిటర్న్ దాఖలు చేసిన నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
4 కోట్ల మార్క్ దాటిన ఐటీఆర్ ఫైలింగ్
4 Crore+ ITRs for AY 2026-27 filed and counting!
— Income Tax India (@IncomeTaxIndia) July 27, 2026
Avoid the 31 July, 2026 deadline stress and file your ITR 1 & 2 early.
File your ITR 1 & 2 for AY 2026-27 now, before the last-minute rush:
🔗 https://t.co/GYvO3mStKf#ITR #ITRFiling #FileNow@nsitharamanoffc @officeofPCM… pic.twitter.com/wupNz24dZt