Diesel, ATF export duties hike: డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకాల పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 12, 2026
09:20 am
ఈ వార్తాకథనం ఏంటి
డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అస్థిరంగా మారడం, అలాగే దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
వివరాలు
డీజిల్‌పై ఎగుమతి సుంకం రూ.55.5కు పెంపు
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం, డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి రూ.55.5కు పెంచింది. అలాగే విమాన ఇంధనం (ATF)పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ.42కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.