NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్
    తదుపరి వార్తా కథనం
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్

    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్

    వ్రాసిన వారు Stalin
    Apr 07, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనం 2023లో కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.

    2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3శాతం కంటే తక్కువ వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ఈ వృద్ధిలో భారత్‌, చైనాల వాటనే సగం ఉంటుందని ఆమె అన్నారు.

    2023లోనే కాదు, వచ్చే ఐదేళ్లలో 3 శాతం కంటే తక్కువ వృద్ధిని సాధించడంతో పాటు మందగించిన ఆర్థిక కార్యకలాపాలు దీర్ఘకాలం కొనసాగుతాయని ఆమె చెప్పారు.

    90శాతం అడ్వాన్స్‌డ్ ఎకానమీలు ఈ ఏడాది తమ వృద్ధి రేటులో క్షీణతను చూస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆమె చెప్పారు.

    ఐఎంఎఫ్

    2022లో సగానికి పడిపోయిన ప్రపంచ వృద్ధి

    గత సంవత్సరం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి, మళ్లీ కరోనా పుంజుకోవడం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు.

    అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కొంత మేరకు ఊపందుకుటాయని, ముఖ్యంగా ఆసియా దేశాల్లో మెజార్టీ వృద్ధిని ఆశించవచ్చని తెలిపారు. 2023లో ప్రపంచ వృద్ధిలో సగం వాటా భారతదేశం, చైనా కలిగి ఉంటాయని ఆమె అంచనా వేశారు.

    కరోనా నుంచి కోలుకున్న తర్వాత, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, ఆ తర్వాత పరిణామాల కారణంగా 2022లో ప్రపంచ వృద్ధి దాదాపు సగానికి పడిపోయింది. 6.1 నుంచి 3.4 శాతానికి పడిపోయినట్లు జార్జివా చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎంఎఫ్
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఐఎంఎఫ్

    పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్ పాకిస్థాన్

    తాజా వార్తలు

    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం చైనా
    నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్ డొనాల్డ్ ట్రంప్
    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు కాంగ్రెస్

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు గ్రహం
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు పాకిస్థాన్
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025